Best Airport Award
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇదే..
ఖతార్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. లండన్‌కు చెందిన పరిశోధనా సంస్థ స్కైట్రాక్స్ ఇటీవల పరిశోధన నిర్వహించి విడుదల చేసిన ర్యాంకుల్లో దోహా హమద్ ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా ఎంపికైంది. ప్రయాణికులు చెక్-ఇన్ విధానాలు, రాకపోకలు, షాపింగ్, భద్రత, ఇమ్మిగ్రేషన్, నిష్క్రమణ ప్రక్రియలు తదితర అంశాలపై 2023 ఆగస్టు నుంచి 2024 ఫిబ్రవరి మధ్య కాలంలో నిర్వహించిన సమగ్ర గ్లోబల్ సర్వే ఆధారంగా స్కైట్రాక్స్ ర్యాంకులు విడుదల చేసింది. జర్మనీలో ఏప్రిల్ 17న 2024 వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డుల కార్యక్రమం జరిగింది. స్కైట్రాక్స్ ర్యాంకుల్లో దోహా హమద్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానం సాధించగా సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయం రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికి వస్తే ఈ జాబితాలో మొదటి వంద విమానాశ్రయాలలో నాలుగు మాత్రమే భారత్‌కు చెందిన ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో ఉండగా, బెంగళూరు ఎయిర్పోర్ట్ 59, హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 61, ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 95వ స్థానాలలో నిలిచాయి. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు జాతీయ అవార్డులు
శంషాబాద్: ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి. 2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ జాతీయ అవార్డుల్లో భాగంగా ‘నేషనల్ ఎనర్జీ లీడర్’అవార్డుతో పాటు ‘ఎక్స్లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్’అవార్డును పొందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లుగా శంషాబాద్ విమానాశ్రయం ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా 4.55 మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసింది. హైదరాబాద్ విమానాశ్రయం ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో అవార్డులు పొందిందని, తమ పనితీరుకు అవార్డులు కొలమానమని జీహెచ్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ అన్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు మరోసారి అరుదైన ఘనత సాధించింది. తాజాగా స్కైట్రాక్స్ ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో అందుతున్న సేవలపై పురస్కారాలు ప్రకటించింది. అందులో జీఎంఆర్ నేతృత్వంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశంలో ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో ఉత్తమఎయిర్‌పోర్టుగా పురస్కారం గెలుచుకుంది. మరోవైపు విమానాశ్రయ సిబ్బంది సేవల విభాగంలో మధ్య ఆసియాలోనే మెరుగైన విమానాశ్రయంగాను అవార్డు దక్కించుకుంది. ఒకేసారి రెండు విభాగాల్లో గుర్తింపు సాధించి తన ప్రత్యేకత చాటుకుంది. లండన్‌లో నిర్వహించిన ప్యాసింజర్ ఎక్స్పో కార్యక్రమంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (జీహెచ్ఐఎల్) ఈ పురస్కారాలను అందుకుంది. -
బెంగళూరు ఎయిర్పోర్ట్ నెంబర్ 1 ..!
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇపుడొక అరుదైన ఘనతను సాంతం చేసుకుంది. విమానాశ్రయాల్లో దిగే (అరైవల్స్) ప్రయాణీకులకు అందిస్తున్న నాణ్యమైన సేవలపై ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ సర్వేలో ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. ఏఎస్ఐఏఎస్క్యూ అరైవల్ త్రైమాసిక సర్వేలో (2018 ఏప్రిల్జూన్ నెలల్లో) భాగంగా అయిదు పాయింట్ల సూచిలో 4.67 పాయింట్లు సాధించి ఈ సేవల్లో అగ్రస్థానాన్ని సాధించింది. ఈ సేవల్లో అబూదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4.53 పాయింట్లతో రెండోస్థానంలో, టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4.44 పాయింట్లతో మూడోస్థానం పొందింది. మనదేశం నుంచి ఈ సర్వేలో పాల్గొన్న ఏకైక విమానాశ్రయం బెంగళూరే. ప్రపంచవ్యాప్తంగా 358 ఎయిర్‌పోర్టుల నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణీకులకు సంబంధించి ఇప్పటికే నిర్వహిస్తున్న సర్వేలో ఇతర దేశాల నుంచి విమానాల్లోంచి దిగుతున్న (అరైవల్) ప్రయాణీకుల సేవలకు సంబంధించి కూడా ఈ అధ్యయనంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టులలో దిగడం, ఇమ్మిగ్రేషన్ (అంతర్జాతీయ ప్రయాణీకులకు మాత్రమే), బ్యాగేజీ తీసుకోవడం, కస్టమ్‌్స, విమానాశ్రయ మౌలికసదుపాయాలపై ప్రయాణీకుల అభిప్రాయాలతో ఏఎస్‌క్యూ అరైవల్స్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం బెంగళూరు ఎయిర్పోర్ట్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయమే కాకుండా దేశంలోనే మూడో అతిపెద్దదిగా పేరుగాంచింది. ప్రాంతీయ కేటగిరిలో భారత్, సెంట్రల్ ఆసియాలోనే అత్యుత్తమ మైనదిగా ఈ ఎయిర్పోర్ట్ గత మార్చి నెలలోనే అవార్డు గెలుచుకుంది.యావత్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం, సిబ్బంది నిబద్ధతతో కూడిన అసాథారణ సేవలకు ఇది గుర్తింపుగా భావిస్తున్నామని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ హరి మరార్ తెలిపారు. నాణ్యతాపరంగా మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, వచ్చే 9 నెలల పాటు కూడా ఉత్తమమైన సేవలందించి ’బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఉత్తమ ఎయిర్పోర్ట్.. జీఎంఆర్ హైదరాబాద్
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు భారత్‌లో ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డ్ లభించింది. ఆప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటి అకాడెమి అందించే ఈ అవార్డ్ 50 లక్షల-కోటిన్నర మంది ప్రయాణికుల కేటగిరిలో తమకు లభించిందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(జీహెచ్ఐఏఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. పనోరమ పేరుతో ఇటీల జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డ్ స్వీకరించామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మనీశ్ సిన్హా పేర్కొన్నారు. కాగా మనీశ్ శర్మకు అప్‌కమింగ్ ఏవియేషన్ ప్రొఫెషనల్ అవార్డ్ కూడా లభించింది. విమాన ప్రయాణికులకు సముచితమైన స్థాయిలో సేవలందించడానికి తాము చేస్తున్న ప్రయాత్నాలకు ఈ అవార్డు ఒక గుర్తింపని కంపనీ సీఈఓ ఎస్జీకే కిశోర్ వెల్లడించారు.