‘సాక్షి’ మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన
ఆరు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
925 మంది విద్యార్థుల హాజరు
విద్యార్థుల్లో మనోస్థైర్యం నింపిన పరీక్షలు
ఒత్తిడి లేకుండా ఎంసెట్ పరీక్ష రాస్తామని ధీమా
పరీక్షల నిర్వహణ పట్ల విద్యార్థుల తలిదండ్రుల హర్షం
సాక్షి మాక్ ఎంసెట్‌కు 18,150 మంది హాజరు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 18,150 మంది హాజరయ్యారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు కేంద్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ పరీక్షలు జరిగాయి. పరీక్ష ‘కీ’ సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ ‘www.sakshieducation.com’ లో చూడవచ్చు. పరీక్షా ఫలితాలను వారం రోజుల్లో వెల్లడించనున్నారు. ఇరు రాష్ట్రాలకు కలిపి.. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు నాలుగు నుంచి పదో ర్యాంకు సాధించిన విద్యార్థులకూ బహుమతులు ఇవ్వనున్నారు. ప్రథమ బహుమతిగా రూ. 15 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 10 వేలు, తృతీయ బహుమతిగా రూ. 7 వేలు, 4-10 ర్యాంకర్లు ఒక్కొక్కరికి రూ. 3 వేలు నగదు బహుమతిగా అందజేయనున్నారు.
ఈ బహుమతులు ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలకు విడివిడిగా ఉంటాయి. సాక్షి మాక్ ఎంసెట్‌కు రాయలసీమ జిల్లాల నుంచి 2,564 మంది విద్యార్థులు హాజరుకాగా, ఒక్క చిత్తూరు జిల్లాలోనే 1,035 మంది పరీక్ష రాశారు. విశాఖ జిల్లాలో పరీక్ష రాసేందుకు 1,100మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 925 మంది విద్యార్థులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 774, కృష్ణాజిల్లా విజయవాడలో 1,246, గుంటూరు జిల్లాలో 710 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని వీఆర్ కళాశాలలో 500 మంది, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాలలో నిర్వహించిన పరీక్షకు 330 మంది హాజరయ్యారు. ఒంగోలులో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ మాక్ ఎంసెట్‌తో పరీక్షపై మంచి అవగాహన వచ్చిందని, తమకు ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
లోపాలను సరిదిద్దుకోవచ్చు
సాక్షి మీడియా గ్రూప్ మాక్ ఎంసెట్ నిర్వహణ పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మాక్ ఎంసెట్‌కు హాజర వడం వల్ల ఒత్తిడిని అధిగమించగలిగామని, లోపాలను సరిదిద్దుకొనే అవకాాశం లభించిందని పలువురు వి ద్యార్థులు పేర్కొన్నారు. ఎంసెట్ పరీ క్షా పత్రం మాదిరిగా ఈ పరీక్షా పత్రం ఉందని, ఇక్కడ తాము సాధించే మా ర్కులను బట్టి తమ ప్రతిభ ఏ స్థాయి లో ఉందో తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు.
తమ ర్యాంకులను మెరుగుపర్చుకునేందుకు ఈ మాక్ ఎంసెట్ దోహద పడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంసెట్ పరీక్షలు మాదిరి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ పరీక్షకు హాజరవడం వల్ల పిల్లలకు బెరుకుతనం, ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఇక ఉండదని పేర్కొన్నారు.