Goa actress
-
వీడియోకాల్ మాట్లాడుతుండగా నటి రూమ్‌లోకి..
న్యూఢిల్లీ: జీవితం అంటేనే అనుభవాల సమాహారం. వాటిల్లో కొన్నిమంచివైతే, మరికొన్ని బాధ కల్గించేవిగా ఉంటాయి. అయితే బాధ పడ్డ సంఘటనలు మాత్రం జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. తన జీవితంలో కూడా ఇలాంటి చేదు అనుభవం ఉంది అంటున్నారు బాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరోజి. వివరాల్లోకి వెళ్తే.. ఎల్నాజ్ గతంలో ఓ సినిమా షుటింగ్‌లో భాగంగా గోవాకి వెళ్లారు. షుటింగ్ ముగిసిన తర్వాత స్నేహితురాలి ఇంటికి వెళ్లి.. అక్కడ కొన్నిరోజులు సరదాగా గడపాలనుకున్నారు. ఈ క్రమంలో ఒక రోజు రాత్రి నటి తన మిత్రుడి బర్త్‌డే పార్టీకి హజరయ్యారు. ఇంటికి వచ్చాక ఎల్నాజ్ తన తల్లితో వీడియోకాల్ మాట్లాడుతున్నారు. ఎల్నాజ్ ఫోన్ మాట్లాడుతూ.. తన గదిలోని కిటికి నుంచి బైటకు చూసి.. షాకయ్యారు. ఏవరో ఆగంతకుడు సెక్యురిటీని దాటి, వారి ఇంటిలోకి ప్రవేశించాడు. కంగారు పడిన ఆమె దీని గురించి తన మిత్రుడికి చెప్పింది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆగంతకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు కేవలం ఎల్నోజ్ని కలవడానికి వచ్చాడని.. ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసుల విచారణలో బయటపడింది. మరోసారి ఇలాంటి పనులు చేయనని ఆ వ్యక్తి లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరడంతో అతడిని విడిచిపెట్టారు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకుంది. అయితే ఇప్పటికి ఆరోజు గుర్తుచేసుకుంటే భయమేస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎల్నోజ్. చదవండి: పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు -
నన్నెవరూ అరెస్ట్ చేయలేదు...
గోవా భామ ఇలియానాకు కోపం వచ్చింది. ‘‘బుద్ధి ఉన్నవాళ్లెవరూ ఇలాంటివి రాయరు. సరైన ఆధారాలు లేకుండా నాపై నిష్కారణంగా నిందలు వేసే అధికారం మీకెవరు ఇచ్చారు?’’ అంటూ బాలీవుడ్ మీడియాపై అంతెత్తు లేచింది. ఇంతకీ ఇలియానా కోపానికి కారణమేంటి? అనుకుంటున్నారా! విషయం ఏంటంటే... ఇలియానా పేరుతో ఇటీవల ఓ వార్త బాలీవుడ్ మీడియాలో షికారు చేయడం మొదలుపెట్టింది. ఆ వార్త అక్కడ నుంచి దక్షిణాదికి కూడా పాకింది. ఇలియానాను ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేశారని, డూప్లికేట్ నంబర్ప్లేటున్న కారును నడుపుతున్న కారణంగా ఇలియానా అరెస్ట్‌కి చేశారనీ, ఓ బాలీవుడ్ ప్రముఖుడి నుంచి వదిలేయమంటూ ఫోన్‌కాల్ రావడంతో వెంటనే వదిలేశారని ఆ వార్త సారాంశం. అయితే... ఇందులో నిజం లేదని ఇలియానా మీడియా సాక్షిగానే వాపోయారు. ‘‘పేరున్న వాళ్లను వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టి డబ్బు సంపాదించుకోవాలనుకునే సంస్కతి మంచిది కాదు. నన్ను అరెస్ట్ చేసింది నిజమే అయితే... ఆ విషయాన్ని పోలీసులే మీడియాకు చెప్పేవారు కదా. మరి ఇప్పటివరకూ ఆ విషయం గురించి పోలీసులు కూడా కిమ్మనలేదు. ఎందుకు? నా అరెస్ట్ నిజం కాదు కాబట్టి. నిజానిజాలు తెలుసుకోకుండా, నా వ్యక్తిగత జీవితానికి మచ్చ తెచ్చేలా రాయడం ఎంతవరకు సమంజసం’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు ఇలియానా.