ఉర్సుగుట్టపై తవ్వకాలు
కరీమాబాద్, న్యూస్‌లైన్ : నగరంలోని రంగలీల మైదానం వద్ద ఉన్న ఉర్సుగుట్టపై గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. గుప్త నిధులకోసమే తవ్వకాలు జరిపినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సమాచారం అందుకున్న ఉర్సు, కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు ఉర్సుగుట్టను సందర్శించారు. గుట్టపై ఉన్న గోదాసహిత రంగనాథస్వామి వారి ఆలయం వద్ద ఉన్న కోనేరు నుంచి ఆలయ గర్భగుడికి వెళ్లే దారిలో కందకం తవ్వినట్లు వారు పేర్కొన్నారు.
గుప్తనిధుల కోసమే ఇలా చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ఆలయ అభివృద్ధిలో భాగంగా తాము కోనేరుతోపాటు దాని పక్కన ఉన్న ఖాళీ స్థలంలోని మట్టిని తీసేసే పని చేశామని, గుప్త నిధుల కోసం కాదని ఆలయ కమిటీ పేర్కొంది. దేవాలయూనికి భక్తులు వేళ్లేందుకు సరైన మెట్లు లేవని, అందుకే తాము మెట్లు నిర్మించే పనిలో ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఏదేమైనా పురావస్తుశాఖ, ఎండోమెంట్ అధికారులు చారిత్రక గోదాసహిత రంగనాయకులు ఆలయాన్ని, రక్షించి అభివృద్ధి చేయాలని ప్రజలు, భక్తుల కోరుతున్నారు.