అది మంచి ముహూర్తం కాదు..
రాజమండ్రి: గోదావరి పుష్కరాలు మంగళవారం ఉదయం 6.26 గంటలకు ప్రారంభమైతే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు 6.21కే స్నానం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి తెలిపారు. ఇది మంచి ముహూర్తం కాదని అందుకే ఇంత ఘోరప్రమాదం జరిగిందని చెప్పారు. పుష్కర పనులన్నీ చంద్రబాబు దగ్గరుండి చూశారని టీడీపీ ఎమ్మెల్యేలు, దేవాదాయ మంత్రి చెప్పారు. కాబట్టి ఈ ప్రమాదానికి చంద్రబాబే కారణమన్నారు. ఆయన రాజీనామే అన్ని సమస్యలకు పరిష్కారమని తెలిపారు. ఈ రోజు ఉదయం రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.