'గాడ్సే పుస్తకాన్ని రిలీజ్ చేస్తే ఒప్పుకోం'
పనాజి: నాధురాం గాడ్సే పేరిట రచించిన ఓ పుస్తకం విడుదల వివాదానికి దారి తీయనుంది. మహాత్మగాంధీ వర్థంతి రోజునే ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం కూడా ఆ వివాదానికి ఆజ్యం పోయనుంది. మహాత్మాగాంధీని నాధూరాం గాడ్సే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ గాడ్సేపైనే 'నాధురాం గాడ్సే-ది స్టోరీ ఆఫ్ యాన్ అస్సాసిన్' అనే పుస్తకం శనివారం విడుదలవుతోంది. దీనిని అనూప్ సర్దేశాయి రచించగా.. బీజేపీ నేత ఒకరు విడుదల చేస్తున్నారు.
అదికూడా ప్రభుత్వం భవనం అయినటువంటి రవీంధ్ర భవన్లో. దీంతో ఈ పుస్తకాన్ని అసలు విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ, విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ గోవాలో కొత్తగా ఏర్పాటయిన పార్టీ గోవా ఫార్వార్డ్ పార్టీ హెచ్చరిస్తోంది. రవీంధ్ర భవన్ ఎదుట తాము సత్యాగ్రహానికి దిగుతామని హెచ్చరిస్తోంది. తాము ఆ భవన్ వైపు వచ్చే మార్గాలన్నింటిని మూసివేస్తామని, ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకావొద్దని వారు సూచిస్తోంది.