godwoman fires
-
కాల్పుల కలకలం.. లొంగిపోయిన మాతాజీ!
పెళ్లి వేడుకలో కాల్పులు జరిపి పరారయిన మాతా సాధ్వి దేవ ఠాకూర్ కర్నల్ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. శుక్రవారం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆమె తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. అధికారుల కథనం ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లి తంతు జరగుతుంటే తుపాకీతో గాల్లోకి సరదాగా కాల్పులు జరుపుతారు. ఈ వారం మొదట్లో హర్యానాలోని కర్నల్ జిల్లాలో సావిత్రి లాన్స్ అనే కళ్యాణ మండపంలో ఓ వివాహం జరిగింది. అందులో పాల్గొన్న సాధ్వి దేవతో పాటు ఆమె అనుచరులు తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మేనత్త చనిపోగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. కాల్పులు జరిపిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరినీ హత్యచేయలేదని.. తనతో పాటు మరికొందరు కాల్పులు జరిపారని పోలీసులకు శుక్రవారం ఆమె తెలిపారు. తాను కాల్పులు జరపగా, ఏ ఒక్కరు గాయపడలేదని చెప్పారు. వాస్తవానికి పోలీసులకు లభ్యమైన వీడియోలో మరో వ్యక్తి కూడా గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధ్వి దేవ జరిపిన కాల్పుల వల్లే వరుడి మేనత్త చనిపోవడంతో ఆమె పరారయిందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కర్నాల్ పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లిలో కాల్పులతో మాతాజీ హల్చల్
-
పెళ్లిలో కాల్పులతో మాతాజీ హల్చల్
ఉత్తరాదిలో ఎక్కడైనా పెళ్లిళ్లు జరిగాయంటే అక్కడ సరదాగా తుపాకులు పట్టుకుని గాల్లోకి కాల్పులు జరపడం సర్వసాధారణం. హర్యానాలోని కర్నల్ జిల్లాలో ఇలాగే ఓ పెళ్లి జరుగుతుంటే అక్కడకు హాజరైన సాధ్వి, ఆమె అనుచరులు కాల్పులు జరపడంతో ఒక మహిళ మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సాధ్వి దేవా ఠాకూర్‌తో పాటు ఆమె భద్రతా సిబ్బంది కూడా తుపాకులతో కాల్చడంతో పెళ్లికొడుకు మేనత్త మరణించింది. దాంతో ఆమెపైన, భద్రతా సిబ్బందిపైన పోలీసులు ఆయుధాల చట్టం కింద పలు సెక్షన్లతో పాటు హత్య కేసు కూడా నమోదు చేశారు. వాళ్లంతా ముందుగా డాన్స్ ఫ్లోర్ వైపు గురిచూసి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయానికి అక్కడున్న వరుడి మేనత్త అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దాంతో సాధ్వి, ఆమె శిష్యగణం అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. కర్నల్ రైల్వేస్టేషన్ సమీపంలోని సావిత్రి లాన్స్ అనే కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది. నిందితులను అరెస్టుచేసేందుకు పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.