బంగారం వేలాన్ని అడ్డుకుంటాం: రఘువీరా
సాక్షి, కాకినాడ: వ్యవసాయ అవసరాలకై మహిళలు కుదువ పెట్టిన బంగారు ఆభరణాలను వేలం వేస్తూంటే చూస్తూ ఊరుకోబోమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. ‘టీడీపీ అధికారంలోకి వస్తే కుదువ పెట్టిన బంగారమంతా మీ చేతుల్లోకి వస్తుంద’ంటూ మాయమాటలు చెప్పిన చంద్రబాబు.. తీరా వచ్చాక ఆ బంగారాన్ని వేలం వేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆదర్శ రైతులు, గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు, ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్లను ఇప్పటికే తొలగించిన సర్కారు.. రేషన్‌షాపు డీలర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలను కూడా ఇంటికి పంపుతోందని తెలిపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, తొలి సంతకానికి చంద్రబాబు విలువ లేకుండా చేశారని విమర్శించారు.