ఎయిర్‌పోర్టులో 1.67 కేజీల బంగారం పౌడర్ సీజ్
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.67 కేజీల బంగారం పౌడర్‌ను కస్టమ్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఉదయం షార్జా నుంచి వచ్చిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
అందులోని ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంగారం పౌడర్‌ను సాక్స్‌ల్లో పెట్టినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అనంతరం బంగారం పౌడర్ స్వాధీనం చేసుకుని.... సదరు ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.