శ్రీవారికి బంగారు శఠగోపం కానుక
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారికి గురువారం బంగారు శఠగోపం కానుకగా అందింది. తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ. 18 లక్షల ఖర్చుతో బంగారు శఠగోపాన్ని తయారు చేయించారు. దీన్ని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ద్వారా ఆలయంలో అందజేశారు.