golden chain
-
పట్టపగలే చైన్ స్నాచింగ్
♦ బరితెగించిన అగంతకుడు ♦ ఉపాధ్యాయురాలి మెడలో గొలుసు తెంచుకుని బైక్‌పై పరారీ ♦ వెంటాడినా దొరకలేదు గుంటూరు ఈస్ట్ : రద్దీగా ఉన్న జీడీసీసీ బ్యాంకు ముందు నడిచి వెళుతున్న ఉపాధ్యాయురాలి మెడలోని బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి తెంచుకుని పరారైన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బ్రాడీపేట 2/10లో నివసించే రజనీ.. అదే రోడ్డులోని శారదానికేతన్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి వెళుతున్నారు. జీడీసీసీ బ్యాంకు సమీపంలోకి రాగానే గుర్తు తెలియని ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై ఆమెకు సమీపంగా వచ్చి మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును తెంచేందుకు ప్రయత్నించాడు. రజని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆమెను బలవంతంగా తోసివేసి పరారయ్యేందుకు యత్నించాడు. పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని సుమారు 10 మంది పట్టుకునేందుకు ప్రయత్నిం చారు. ద్విచక్ర వాహనానికి అడ్డుగా వచ్చినవారిని ఢీకొట్టేందుకు యత్నించాడు. దీంతో వారు పక్కకు తొలగడంతో వేగంగా దూసుకు వెళ్లాడు. 4/14 లైన్ చేరుకునే సరికి అగంతకుడి వాహనం వేగానికి అదుపు తప్పింది. అయినా వేగంగా కదిలి ముందుకు దూసుకుపోయాడు. స్థానికులు ద్విచక్రవాహనాలపై పట్టుకునేందుకు వెంబడించినా ఫలితం లేకపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
మహిళపై దాడి : బంగారం చైన్ చోరీ
వరంగల్: వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం సిగ్నల్ తండాలో దారుణం చోటు చేసుకుంది. ధనమ్మ అనే మహిళపై దుండగులు గొడ్డలితో దాడి చేసి... ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారం చైన్‌ను లాక్కెళ్లారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. ధనమ్మ స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినీఫక్కీలో మోసం
నకిలీ బంగారు బిస్కెట్‌తో బంగారు గొలుసు అపహరణ బద్వేలు అర్బన్ : స్థానిక నాలుగు రోడ్ల కూడలి సమీపంలో ఓ మహిళను సినీ ఫక్కీలో మోసం చేశారు.. నకిలీ బంగారు బిస్కెట్ ఎర చూపి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. మోసపోయినట్లు గుర్తించిన మహిళ పట్టణ పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం పట్టణంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలలోకెళితే.. బద్వేలు మండలంలోని అనంతరాజపురం పంచాయతీ గుండంరాజుపల్లె గ్రామానికి చెందిన బుర్రి వీర నారాయణమ్మ తన కుమారునికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న ఓ 50 ఏళ్ల మహిళ వచ్చి వీరనారాయణమ్మతో ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయని, తదితర విషయాలు మాట్లాడుతూ మెల్లగా పరిచయం పెంచుకుంది. ఇంటికి బయలుదేరేందుకు నాలుగు రోడ్ల కూడలికి వస్తున్న వీరనారాయణమ్మతో సదరు మహిళ కూడా ప్రయాణించి తనకు పది తులాల బంగారు బిస్కెట్ దొరికిందని, దాని విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని, దా నిని ఇద్దరం సమానంగా పంచుకుందామని నమ్మబలికింది. ఇందుకు ఆశపడ్డ వీరనారాయణమ్మ సగం చేయడం ఎలా అంటూ సదరు మహిళను ప్రశ్నించింది. విలువైన బంగారు బిస్కెట్‌ను బంగారు అంగళ్ల వద్దకు తీసుకెళితే పోలీసులకు తెలుస్తుందని మొత్తం బిస్కెట్ నీవే తీసుకుని.. నీ వద్ద గల బంగారు గొలుసు ఇవ్వాలని వృద్ధురాలు కోరింది. పూర్తిగా ఆమె మాయలో పడ్డ వీరనారాయణమ్మ సుమారు లక్ష రూపాయల విలువ చేసే బంగారు గొలుసును అప్పగించింది. నకిలీ బంగారు బిస్కెట్‌తో ఇంటికి వెళ్లి తన భర్తకు చూపించగా నకిలీదని గుర్తించిన ఆయన పట్టణానికి చేరుకుని బంధువులతో కలిసి చుట్టుపక్కలా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.