బంగారు కోడిపెట్ట.. పెంచుకోండి..
రోజుకో గుడ్డు తినండి.. వ్యాధుల నుంచి దూరంగా ఉండండి అని వైద్యులు చెబుతున్నారు. అధిక పోషక విలువలతో కూడిన గుడ్డు వినియోగం ఇటీవల పెరిగింది. పలు రకాల కోళ్ల ఉత్పత్తి పెరుగుతోంది. కొత్త కొత్త రకాల కోళ్లు దర్శనమిస్తున్నాయి. సిరుల పండించే కోళ్ల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక పోషక విలువలు, ఆదాయూన్ని ఇస్తూ వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాల పెంపకంపై తాడేపల్లిగూడెం మండలం వెంక్రటామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. శ్రీనిధి, వనరాజా కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ.. ఔత్సాహిక రైతులను గుర్తించి వారికి పరిశీలన కోసం ఉచితంగా యూనిట్లను అందిస్తున్నారు. - వెంకట్రామన్నగూడెం (తాడేపల్లిగూడెం)
రైతులకు లాభాలు పంచడానికి, పోషకాహారంతో కూడిన గుడ్లును అందించే శ్రీ నిధి, వనరాజా కోళ్ల పెంపకాన్ని కేవీకే ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా ముందుగా హైదరాబాద్‌లో ప్రాజెక్టు ైడె రెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ నుంచి తయారుచేసిన కోడి పిల్లలను రైతులకు ఇస్తారు. తొమ్మిది పెట్టలు, ఒక పుంజు పిల్లను యూనిట్‌గా కేవీకే రైతులకు అందిస్తోంది. ఆరు
వారాల వయసు ఉన్న కోడిపిల్లలను అందించగా ఇవి ఆరు నెలల వయసు నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తారుు. ఏడాదికి సుమారు 180 నుంచి 220 గుడ్లను జీవించి ఉన్నంత కాలం పెడుతుంటాయి. వీటికి పెరట్లో హారుుగా తిరిగే వీలు కల్పించాలి. అందుబాటులో ఉండే ఆహారం అందిస్తే సరిపోతుంది. కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువు వరకు పెరుగుతాయి. ఏడాదిలోపు ఈ బరువును చేరుకుంటారుు. అప్పుడు సగం కోళ్లను అమ్ముకుంటే రైతుకు రూ. 2,500 ఆదాయం వస్తుంది. వనరాజా కోళ్లు బలిష్టంగా, చిన్న కాళ్లతో ఎదుగుతాయి. ఇవి గుడ్లను పొదగవు, నాటు కోళ్ల ద్వారా వీటి గుడ్లను పొదిగించవచ్చు.
గుడ్డు ధర రూ.10 నుంచి రూ.15
వనరాజా గుడ్డు ధర రూ.10 నుంచి రూ.15 ఉంది. అయితే వీటి పిల్లలు కుక్కలకు సుల భంగా దొరికిపోతుంటారుు. దీంతో కేవీకే శాస్త్రవేత్తలు శ్రీ నిధి కోళ్లను అభివృద్ధి చేశారు. ఇవి వనరాజా కోళ్ల మాదిరిగానే ఉన్నా కాళ్లు కాస్త పొడవుగా ఉంటాయి. ఎగిరే గుణం ఉంటుంది. బరువు వనరాజాతో పోలిస్తే 200 గ్రాములు తక్కువుగా ఉంటుంది. రంగుల్లో ఉంటాయి. ఇటీవల వీటి పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆరు వారాల వయసున్న వనరాజా కోడిపిల్ల ధర రూ.120. ఉండ్రాజవరానికి చెంది న బాలాజీ అనే రైతు వీటిని హేచరీలో పెం చుతూ, అవసరమైన వారికి విక్రయిస్తున్నారు.
మంచి పోషకాహారం
వనరాజా, శ్రీ నిధి కోళ్ల పెంపకం వల్ల రైతులకు ఆదాయానికి ఆదాయం, పోషకాహారానికి పోషకాహారం లభిస్తుంది. తెలికిచర్ల, చోడవరం, బంగారుగూడెం, వెల్లమిల్లి, వెంకట్రామన్నగూడెం గ్రామాల్లో రైతులకు వీటిని ఉచి తంగా ఇచ్చి పెంపకాలను ప్రోత్సహిస్తున్నాం.
- ఈ.కరుణశ్రీ, కేవీకే సమన్వయ కర్త, వెంకట్రామన్నగూడెం