విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కుల్కచర్ల(రంగారెడ్డి జిల్లా): ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగి మండల పరిధిలోని రాంరెడ్డిపల్లిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన గోపాల్(25) తన మామతో కలిసి రాంరెడ్డిపల్లికి చెందిన గొల్ల భీమయ్య బోరుబావికి విద్యుత్ లైన్ వేయడానికి వచ్చాడు.
పనులు పూర్తయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గర కనె క్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ట్రాన్స్కో అధికారులు విద్యుత్ ప్రసారం బంద్ చేశామని చెప్పడంతోనే గోపాల్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడని, వారి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.