రేపు జిఓఎం తుది సమావేశం : జైరామ్ రమేష్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జిఎంఓ) రేపు తుదివిడత సమావేశం కానున్నట్లు కేంద్ర మంత్రి, జిఎంఓ సభ్యుడు జైరామ్ రమేష్ చెప్పారు. నార్త్‌బ్లాక్‌లో రేపు ఉదయం 11 గంటలకు జిఓఎం సభ్యులు సమావేశమవుతారన్నారు. సమావేశానికి మొత్తం ఏడుగురు సభ్యులు హాజరవుతారని చెప్పారు.
రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ అధిష్టానం తొందరపడుతున్న విషయం తెలిసిందే. రేపటి సమావేశంతో రాష్ట్ర విభజనకు సంబంధించి జిఎంఓ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను సీమాంధ్ర కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, కోట్ల విజయభాస్కర రెడ్డి, చిరంజీవి కలిశారు.