రాజానాయుడుని స్ఫూర్తిగా తీసుకోవాలి
సంగం : నీలాయపాలెం ప్రజల్లో చైతన్యం తెచ్చి గ్రామాన్ని బహిరంగ మలవిసర్జనరహిత గ్రామంగా తీర్చిదిద్దిన సర్పంచ్ రాజానాయుడుని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీడీఓ జయరామయ్య కొనియాడారు. మండలంలోని నీలాయపాలెం పంచాయతీలో సర్పంచ్ చొరవతో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తికావడంతో బుధవారం అభినందనసభ ఏర్పాటుచేశారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీపీ దగ్గుమాటి కామాక్షమ్మ మాట్లాడుతూ నీలాయపాలెం బహిరంగ మలవిసర్జనరహిత గ్రామంగా మండలంలో ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. తహసీల్దార్ రామాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయం, సంగం వైధ్యాధికారిని డా.రాగిణి ప్రసంగించారు.అనంతరం సర్పంచ్‌ను సన్మానించారు. మొక్కలు నాటారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గౌస్‌అహ్మద్, పీఆర్ ఏఈఈ మల్లికార్జున, హౌసింగ్ ఏఈ రాజారావు, ఏపీఎం రవిశంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఏటూరు సుధాకర్‌రెడ్డి, సీహెచ్ కష్ణారెడ్డి, వెంగారెడ్డిపాళెం వైఎస్సార్సీపీ నేత కనుమూరి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.