Good salary
-
రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!
Australia Job Ad: ఏ దేశంలో అయినా డాక్టర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఈ డిమాండ్ మరింత పెరిగింది. ఈ డిమాండ్‌తో పాటు వేతనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డాక్టర్లకు అద్భుతమైన శాలరీ మాత్రమే కాకుండా, అంతకు మించిన స్పెషలిటీస్ కూడా అందిస్తున్నాయి. ఇటీవల ఒక ట్విటర్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రూ. కోటికి పైగా ప్యాకేజీ.. సోషల్ మీడియాలో వెల్లడైన జాబ్ యాడ్ పోస్ట్ ప్రకారం, ఏడాదికి రూ.1.30 కోట్లు జీతం అందిస్తామని, అంతే కాకుండా నెలలో కేవలం 10 రోజులు మాత్రమే పని దినాలు, మిగిలిన 20 రోజులు సెలవులు అని తెలిపింది. ఇది జాబ్ అడ్వర్టైజ్మెంట్ బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ యూనియన్ ప్రముఖ జర్నల్ BMJలో ప్రచురితమైంది. ఇంకా సైన్ ఇన్ బోనస్ కింద రూ. 2.7 లక్షలు కూడా అందుతాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ మెడికల్ రిక్రూట్మెంట్ సంస్థ బ్లూగిబ్బన్ ఈ యాడ్ రూపోంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఆస్ట్రేలియా నేషనల్ హెల్త్ స్కీమ్‌తో (NHS) కలిసి పనిచేయాలని వెల్లడించింది. ఇది డాక్టర్లకు గొప్ప అవకాశం అనే చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియాలో ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వం మధ్య వేతనాలకు సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది. (ఇదీ చదవండి: ఇండియన్ సెలబ్రిటీల మనసు దోచిన అమెరికన్ బ్రాండ్ కారు, ఇదే - చూసారా..!) How depressing to see this in the BMJ. It’s hard to say those figures don’t present a compelling argument. It all leads to a big question for the govt: if you don’t address doctors’ very reasonable pay concerns, alongside their conditions and wellbeing, guess where they’re going? pic.twitter.com/24oKKrgfLa — Adam Kay (@amateuradam) May 3, 2023 ముఖ్యంగా యూకేలోని గ్రాడ్యుయేట్ డాక్టర్లను ఆస్ట్రేలియా ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్, ఎమర్జెన్సీ, ఎక్స్పీరియన్స్ వంటివి ఉన్నవారికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది. మొత్తం మీద ఎక్కువ శాలరీ కావాలనుకునే డాక్టర్లు ఆస్ట్రేలియన్ అందిస్తున్న ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగంలో చేరేవారికి వసతి సదుపాయం కూడా లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఇన్ఫోసిస్ వద్దనుకుని వంకాయ సాగు - కళ్ళు చెదిరే సంపాదన..
చదువుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ కొంతమంది ఉద్యోగాలు వదిలి తెలివితేటలతో జీవితంలో ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారు. అలాంటి కేటగిరికి చెందిన వారిలో ఒకరు తమిళనాడుకి చెందిన 'వెంకటస్వామి విగ్నేషన్'. ఇంతకీ ఈయన ఏ ఉద్యోగం చేసారు, ఎందుకు వదిలేసారు? ఇప్పుడేం చేస్తున్నారనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. తమిళనాడు తూతుక్కుడి జిల్లా కోవల్పట్టి ప్రాంతానికి చెందిన 'వెంకటస్వామి విగ్నేష్' చెన్నైలోని ఇన్ఫోసిస్‌లో జాబ్ చేసేవాడు. అయితే అతి తక్కువ కాలంలోనే అతని ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అనుకున్నవిధంగానే జాబ్ మానేసి వంకాయ సాగు చేయడం మొదలెట్టాడు. జపాన్‌లో వంకాయ సాగు చేస్తూనే అతడు సాఫ్ట్వేర్ జాబ్ కంటే రెండు రెట్లు ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం నెలకు రూ. 80వేలు సంపాదిస్తున్నట్లు సమాచారం. అంటే అతడు ఉద్యోగం చేసే సమయంలో అతని జీతం రూ. 40వేలు మాత్రమే. తనకు వ్యవసాయమంటే ఇష్టమని లాక్డౌన్ సమయంలో తన కుటుంబం చేసే వ్యవసాయం చేయాలనుకున్నట్లు వెంకటస్వామి తెలిపారు. అయితే తమ కుటుంభం చేసే వ్యవసాయంలో అనుకున్న లాభాలు వచ్చేవి కావని కూడా వివరించారు. అయితే వ్యవసాయంలో ఎక్కువ సంపాదించడానికి జపాన్ వంటి దేశాలలో మంచి అవకాశాలు ఉండటం వల్ల అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు. చెన్నైలోని నిహాన్ ఎడ్యుటెక్ ఇన్స్టిట్యూట్ సీఐఐ భాగస్వామ్యంతో జపాన్ భాషలోట్రైనింగ్ ఇచ్చి అక్కడికి పంపించి వ్యవసాయం చేసేందుకు సాయం చేస్తున్నట్లు తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న విగ్నేషన్ ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. గత సంవత్సరం మార్చిలో వంకాయ సాగు మొదలు పెట్టాడు. ప్రస్తుతం ట్యాక్స్ వంటివి పోయి నెలకు రూ. 80,000 వరకు సంపాదిస్తున్నాడు. అయితే తానూ నేర్చుకున్న మెలకువలతో తప్పకుండా భారత్‌లో సరికొత్తగా వ్యవసాయం చేయాలనుకున్న విషయం కూడా చెప్పుకొచ్చారు. -
పైలెట్స్‌కు బంగారు భవిష్యత్తు
-
అలవాట్లో పొరపాట్లు..
మంచి జీతం వచ్చే ఉద్యోగమైనా .. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో నరేష్‌కి అలసత్వ ధోరణి కాస్త ఎక్కువే. కరెంటు బిల్లులు కట్టాలంటే.. బోలెడంత సమయం ఉంది తర్వాత కట్టొచ్చులే అంటాడు... అడ్డగోలుగా ఖర్చులు చేయడం మంచిది కాదని తెలిసినా ఏం ఫర్వాలేదని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. చిట్టచివరికి అన్నీ కట్టేసి పర్సు చూసుకునే సరికి ఖాళీ. ఇంకా కొన్ని బకాయిలు అలాగే మిగిలిపోతుంటాయి. దీంతో, మళ్లీ లాటరీ కొట్టాల్సిన పరిస్థితి. ప్రతి నెలా ఇదే తంతు. కనీసం వచ్చే నెల నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. అయినా సరే, సేమ్ టు సేమ్. ఇలా అలవాటుగా పొరపాట్లు చేసే నరేష్‌లు మనలో చాలా మందే ఉంటారు. ఇలాంటి కొన్ని పొరపాట్ల గురించి తెలిపేదే ఈ కథనం.. ఇష్టారీతిగా కొనుగోళ్లు.. కొందరు ఆకర్షణీయమైన ఆఫర్ అంటూ కనిపిస్తే అవసరమున్నా, లేకున్నా కొనే దాకా వదలరు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదనుకున్నా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు మొదలైనవాటిల్లో అంత సులభం కాదు. చిట్టచివర్న ఉండే బిల్లింగ్ కౌంటరు దగ్గర కూడా స్పెషల్ ఆఫర్లు ఊరిస్తుంటాయి. షాపింగ్ లిస్టులోకి చేరిపోతుంటాయి. దీంతో ఎంత స్ట్రిక్టుగా షాపింగ్ చేశామనుకున్నా చివర్లో పర్సుపై భారం తప్పదు. అలాగే, అనవసరమైనవన్నీ కొనేయడం వల్ల ఇంటి నిండా సరంజామా పేరుకుపోవడం తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి, ఇలాంటి అలవాటు ఉంటే సాధ్యమైనంత వరకూ పర్సులపై భారాలు మోపే మార్కెట్స్ వైపు వెళ్లకుండా ఇతరత్రా షాపింగ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేస్తే ఉత్తమం. ఒకవేళ వెళ్లినా.. వీలైనంత వరకూ అవసరమైన వాటి జాబితాను రాసుకుని, దానికే కట్టుబడి ఉండేందుకు ప్రయత్నం చేస్తే మంచిది. అన్నింటికీ రేట్లు పోల్చి చూసుకోవడం.. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అన్నింటి రేట్లు పోల్చి చూసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు.. ఒకే ఉత్పత్తిని రెండు, మూడు కంపెనీలు ఆఫర్ చేస్తుంటే.. అందులో అత్యంత తక్కువకి ఏది వస్తుందో చూసుకుని, దాన్ని కొనేందుకే ప్రాధాన్యం ఇస్తుంటాం. ఈ క్రమంలో నాణ్యతను విస్మరిస్తుంటాం. కొన్ని సార్లు దీని వల్ల మరింత మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. అలాగని, చౌకగా ఉండేవన్నీ నాణ్యత లేనివనీ చెప్పలేము. కానీ, అంతిమంగా రేటు మాత్రమే కాకుండా నాణ్యతను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. బిల్లులు కట్టడంలో ఆలస్యం.. కరెంటు బిల్లులు, నీటి బిల్లులు, క్రెడిట్ కార్డుల బిల్లులు.. ఇలాంటి వాటన్నింటినీ ఆఖరు నిమిషం దాకా కట్టకుండా వాయిదా వేస్తుంటాం. తీరా ఆఖర్లో గుర్తుకొచ్చి హడావుడిగా పరుగెత్తినా.. ఏదో ఒక అడ్డంకి రావొచ్చు. చివరికి ఫైన్లు కట్టుకోవాల్సీ రావొచ్చు. ప్రతి సారీ ఇదే పరిస్థితి ఎదురవుతుంటే.. ఆలోచించాల్సిన విషయమే. సాధ్యమైనంత వరకూ బిల్లులు కట్టడానికంటూ ఒక పద్ధతిని రూపొందించుకోవాలి. ఏయే బిల్లులు ఎప్పుడెప్పుడు కట్టాలన్నది ముందుగానే రిమైండర్లు సెట్ చేసి ఉంచుకోవాలి. మరోవైపు, చెక్కుల విషయంలోనూ ఒకోసారి పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని సార్లు చెక్కులు ఇచ్చిన తర్వాత గుర్తొస్తుంది .. ఖాతాలో సరిపడేంత డబ్బు లేదని. తర్వాత వే ద్దాంలే అనుకుంటూ కాలయాపన చేస్తాం. తీరా సదరు చెక్కు బౌన్సు అయితే, అవతలి వారికి సర్ది చెప్పుకోవడం మాట ఎలా ఉన్నా.. ఇటు బ్యాంకు మాత్రం పెనాల్టీలు వేస్తుంది. ఫలితంగా జరిమానా కట్టాల్సి రావడం ఒకెత్తై క్రెడిట్ హిస్టరీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తరహా పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలి. క్రెడిట్ కార్డుల వాడకం .. తర్వాతెప్పుడో కట్టొచ్చని, రివార్డు పాయింట్లు గట్రా వస్తాయి కదాని అయిన దానికి, కాని దానికి క్రెడిట్ కార్డులను ఉపయోగించేస్తుంటారు కొందరు. దీంతో కార్డుపై రుణ భారం పెరిగిపోతుంది. క్రెడిట్ కార్డు ఉంటే చేతిలో డబ్బు ఉన్నట్లే.. కానీ అది అప్పుగా తీసుకుంటున్నదేనని గుర్తుంచుకోవాలి. ఇతరత్రా ఏదైనా అవసరాల వల్ల బిల్లులను చెల్లించలేకపోతే .. తర్వాత తర్వాత బడ్జెట్ తలకిందులవడంతో పాటు క్రెడిట్ రిపోర్టుపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఆదాయం కన్నా ఖర్చులు చాలా తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.