చదువుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ కొంతమంది ఉద్యోగాలు వదిలి తెలివితేటలతో జీవితంలో ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారు. అలాంటి కేటగిరికి చెందిన వారిలో ఒకరు తమిళనాడుకి చెందిన 'వెంకటస్వామి విగ్నేషన్'. ఇంతకీ ఈయన ఏ ఉద్యోగం చేసారు, ఎందుకు వదిలేసారు? ఇప్పుడేం చేస్తున్నారనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
తమిళనాడు తూతుక్కుడి జిల్లా కోవల్‌పట్టి ప్రాంతానికి చెందిన 'వెంకటస్వామి విగ్నేష్' చెన్నైలోని ఇన్ఫోసిస్‌లో జాబ్ చేసేవాడు. అయితే అతి తక్కువ కాలంలోనే అతని ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అనుకున్నవిధంగానే జాబ్ మానేసి వంకాయ సాగు చేయడం మొదలెట్టాడు.
జపాన్‌లో వంకాయ సాగు చేస్తూనే అతడు సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే రెండు రెట్లు ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం నెలకు రూ. 80వేలు సంపాదిస్తున్నట్లు సమాచారం. అంటే అతడు ఉద్యోగం చేసే సమయంలో అతని జీతం రూ. 40వేలు మాత్రమే.
తనకు వ్యవసాయమంటే ఇష్టమని లాక్‌డౌన్ సమయంలో తన కుటుంబం చేసే వ్యవసాయం చేయాలనుకున్నట్లు వెంకటస్వామి తెలిపారు. అయితే తమ కుటుంభం చేసే వ్యవసాయంలో అనుకున్న లాభాలు వచ్చేవి కావని కూడా వివరించారు. అయితే వ్యవసాయంలో ఎక్కువ సంపాదించడానికి జపాన్ వంటి దేశాలలో మంచి అవకాశాలు ఉండటం వల్ల అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు.
చెన్నైలోని నిహాన్ ఎడ్యుటెక్ ఇన్‌స్టిట్యూట్ సీఐఐ భాగస్వామ్యంతో జపాన్ భాషలోట్రైనింగ్ ఇచ్చి అక్కడికి పంపించి వ్యవసాయం చేసేందుకు సాయం చేస్తున్నట్లు తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న విగ్నేషన్ ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. గత సంవత్సరం మార్చిలో వంకాయ సాగు మొదలు పెట్టాడు. ప్రస్తుతం ట్యాక్స్ వంటివి పోయి నెలకు రూ. 80,000 వరకు సంపాదిస్తున్నాడు. అయితే తానూ నేర్చుకున్న మెలకువలతో తప్పకుండా భారత్‌లో సరికొత్తగా వ్యవసాయం చేయాలనుకున్న విషయం కూడా చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment