పట్టాలు తప్పిన గూడ్స్ రైలింజన్
గుత్తి : స్థానిక డీజిల్ షెడ్ వద్ద ఉదయం 6 గంటల సమయంలో గూడ్స్ రైలింజన్ (నంబర్ 70508) షంటింగ్ చేస్తున్న సమయంలో పట్టాలు తప్పింది. ఎలాంటి ఆస్తి నష్టమూ సంభవించలేదు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు టెక్నీషియన్లను, మెకానిక్‌లను పంపి ఇంజిన్‌ను తిరిగి యథాస్థితికి తెచ్చారు. గత మంగళవారం కూడా గుత్తి రైల్వే స్టేషన్లో రైలింజన్ పట్టాలు తప్పిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇది మరువకముందే తిరిగి రైలు ఇంజిన్ పట్టాలు తప్పండంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధికారులను ప్రశ్నిచంగా చలి కాలంలో పట్టాలు సంకోచించడంతో ఇలాంటి ఘటనలు ఏర్పడుతున్నాయన్నారు.