Google voice search
-
వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్.. ఇలా చేస్తే సరి!
WhatsApp Voice Calls Recording Tips: కాల్ రికార్డింగ్‌లు.. ఈ మధ్యకాలంలో ‘సేఫ్‌సైడ్’ వ్యవహారాలుగా మారిపోయాయి. ఇంటర్వ్యూలు, ఆన్లైన్ క్లాసుల రికార్డింగ్.. అన్నింటికి మించి ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కాల్ రికార్డింగ్‌లు చేస్తుండడం చూస్తున్నాం. అయితే వాట్సాప్ కాల్స్‌కు రికార్డింగ్ ఆప్షన్ ఉండదని, అవతలివాళ్లు రికార్డు చేయలేరేమోనని చాలామంది పొరపడుతుంటారు. కానీ, వాట్సాప్ కాల్స్‌ను కూడా రికార్డు చేయొచ్చు. సింపుల్.. ఫోన్లో వాయిస్ రికార్డింగ్ యాప్ ఏదైనా ఉంటే చాలు, వాట్సాప్ వాయిస్ కాల్‌ను రికార్డు చేసేయొచ్చు. అంటే వాట్సాప్‌లో ఇన్‌బిల్డ్ ఫీచర్ లేకున్నా.. థర్డ్ పార్టీ యాప్‌ను వాట్సాప్ అనుమతిస్తుందన్నమాట. అయితే ఆ టైంలో .. స్పీకర్‌ను తప్పనిసరిగా ఆన్ చేయాలి. లేకుంటే ఆ వాయిస్ రికార్డు అవ్వదు. ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక రికార్డింగ్ యాప్‌ల ద్వారా వాట్సాప్ వీడియో కాల్స్‌ను సైతం రికార్డ్ చేయొచ్చు. అదే యాపిల్ ఫోన్లలో ఇలా రికార్డింగ్ చేయడం కుదరదు. కారణం.. థర్డ్ పార్టీ యాప్‌లను యాపిల్ అనుమతించకపోవడం, పైగా మైక్రోఫోన్ రికార్డింగ్‌కు తగ్గట్లు ఫీచర్ లేకపోవడం. క్యూబ్ కాల్ క్యూబ్ కాల్ అనేది ఫ్రీ రికార్డింగ్ యాప్. సిగ్నల్, స్కైప్, వైబర్, వాట్సాప్, హంగవుట్స్, ఫేస్బుక్, ఐఎంవో, వీచాట్.. ఇలా వేటి నుంచైనా వాయిస్ కాల్ రికార్డు చేయగలదు. ఈ యాప్ కొన్ని ఫోన్లలో ‘షేక్’(అటు ఇటు ఊపడం) ద్వారా పని చేస్తుంది కూడా. ఒకవేళ ఈ యాప్స్ ఏవీ వద్దనుకుంటే.. ప్లేస్టోర్ నుంచి గూగుల్ రికార్డర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. క్యూబ్ కాల్, గూగుల్ రికార్డర్.. ఈ రెండూ ఫ్రీ యాప్స్. పైగా తేలికగా ఎవరైనా ఉపయోగించొచ్చు. ఇక యాపిల్ ఫోన్లలో ఇలా రికార్డు చేసే వీలు లేనప్పటికీ.. మాక్‌లో మాత్రం క్విక్‌టైం ద్వారా వాట్సాప్ వాయిస్ కాల్స్‌ను రికార్డు చేసే వీలుంది. చదవండి: Google Photos- ఇలా చేయకుంటే మీ ఫొటోలు డిలీట్ అవుతాయి మరి! -
గుల్జార్ ఖాన్ @గూగుల్ వాయిస్!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళను ప్రేమించి భారత్‌లోకి దొడ్డిదారిన అడుగు పెట్టిన పాకిస్తానీ గుల్జార్ ఖాన్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాకిస్తాన్లో పుట్టి పెరిగి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ.. ఫోన్ ద్వారా పరిచయమైన ఆమె కోసం కర్నూలు చేరుకుని.. పదకొండేళ్ల తర్వాత సొంత గడ్డపై మమకారంతో కుటుంబంతో సహా తిరిగి వెళ్లాలని ప్రయాణమైన ఇతడిని ఇటీవల నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సిట్ అధికారుల విచారణలో గుల్జార్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పినట్టు సమాచారం. సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో పుట్టి పెరిగి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ.. ఫోన్ ద్వారా పరిచయమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ కోసం దొడ్డిదారిన దేశంలోకి అడుగు పెట్టాడు. అయితే పదకొండేళ్ల తర్వాత సొంత గడ్డపై మమకారంతో కుటుంబంతో సహా తిరిగి వెళ్లాలని భావించాడు. పాక్‌లోని సియాల్కోట్ జిల్లాలో ఉన్న తన పరివారాన్ని పట్టుకోవడానికి గూగుల్ వాయిస్‌ను వినియోగించాడు. కర్తార్‌పూర్ కారిడార్ మీదుగా ఆ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ గత నెలలో హైదరాబాద్‌లో పోలీసులకు చిక్కాడు. పాకిస్తానీ షేక్ గుల్జార్ ఖాన్ వ్యవహారమిదీ. అతడిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు వివిధ కోణాల్లో విచారించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. హరిద్వార్ వాసిగా భారత్‌కు.. పాకిస్తాన్‌లోని కుల్వాల్ ప్రాంతానికి చెందిన గుల్జార్ ఖాన్ 2004లో దుబాయ్‌లో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో ఓ రోజు తనకు పొరపాటుగా వచ్చిన మిస్డ్ కాల్‌కు స్పందించి కాల్ బ్యాక్ చేశాడు. అలా కర్నూలు జిల్లా గడివేములకు చెందిన దౌలత్‌బీతో పరిచయం ఏర్పడింది. అప్పటికే దౌలత్‌కు వివాహం కాగా.. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దౌలత్తోపరిచయం ప్రేమకు దారి తీయడంతో గుల్జాన్ భారత్‌కు వచ్చేందుకు 2008లో సౌదీ వెళ్లాడు. తాను హరిద్వార్ నుంచి హజ్ యాత్రకు వచ్చానని, తన పాస్‌పోర్ట్ సహా డాక్యుమెంట్లు పోయాయని అక్కడి ఎంబసీలో ఫిర్యాదు చేశాడు. గుల్జార్‌కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (ఈసీ) జారీ చేసిన అధికారులు విమానంలో ముంబైకి పంపారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతగాడు దౌలత్‌బీని వెతుక్కుంటూ కర్నూలు మీదుగా గడివేముల చేరుకున్నాడు.ఆమెను కలుసుకున్న గుల్జార్ వివాహం చేసుకోవడంతోపాటు పెయింటర్‌గా అక్కడే స్థిరపడ్డాడు. తాను భారతీయుడినే అంటూ ఆధార్, ఓటర్ ఐడీ తదితరాలను పొందాడు. ప్రస్తుతం గుల్జార్–దౌలత్లకు నలుగురు సంతానం. కుమారుడి సలహాతో.. కుల్వాల్లో నివసిస్తున్న గుల్జార్ కుటుంబం ఆర్థికంగా స్థిరపడిందే. ఇతడి ఇద్దరు సోదరీమణులు వైద్యులుగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలతో గడివేములలో ఉంటున్న గుల్జార్‌కు టీబీ సోకింది. దీంతో ఏ పనిచేయలేకపోతున్న అతను స్వదేశానికి వెళ్లిపోయి కుటుంబంతో కలిసి బతకాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కుమారుడు గూగుల్ వాయిస్ విషయం చెప్పాడు. తాను టీవీలో ఒక వాణిజ్య ప్రకటన చూశానని, అందులో గూగుల్ వాయిస్ వాడే విధానం ఉందని వివరించాడు. దీంతో ఓ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన గుల్జార్ గూగుల్ వాయిస్‌లో తన ఊరు పేరు చెప్పాడు. సియాల్కోట్లోని కుల్వాల్ వివరాలు చూపించిన గూగుల్.. అక్కడి ఓ వస్త్రదుకాణం బోర్డును చూపించింది. ఆ బోర్డుపై ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదించిన గుల్జార్ తనతోపాటు కుటుంబం వివరాలు చెప్పి, తన తల్లి షరీఫాబీతో మాట్లాడించాలని కోరుతూ వారికి తన నంబర్ ఇచ్చాడు. అనంతరం వీరి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి. కర్తార్‌పూర్ మీదుగా వెళ్దామని.. భారత్ నుంచి పాస్‌పోర్ట్, వీసాతో పాకిస్తాన్‌కు వచ్చి ఉండిపోవడం కష్టమని, దీని కంటే పంజాబ్‌లోని కర్తార్‌పూర్ కారిడార్ మీదుగా అడ్డదారిలో రావాలని సోదరుడు షాజీద్ సలహా ఇచ్చాడు. దీంతో ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్ వెళ్లేందుకు కర్నూలు నుంచి రైలులో గత నెలలో కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చాడు. అప్పటికే ఇతడి వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించి హైదరాబాద్ సిట్ పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో సిట్ బృందం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద వీరిని పట్టుకుంది. గుల్జార్‌ను అరెస్టు చేసిన పోలీసులు దౌలత్‌బీ తదితరులను విడిచిపెట్టారు. కోర్టు అనుమతితో గుల్జార్‌ను ఇటీవల కస్టడీలోకి తీసుకున్నసిట్ పోలీసులు అతడిని వివిధ కోణాల్లో విచారించారు. సిటీ నుంచి కర్నూలు తీసుకెళ్లి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని వచ్చారు. ఇతడి నుంచి గడివేములలో తీసుకున్న గుర్తింపుకార్డులు, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. -
తెలుగులోనూ గూగుల్ అసిస్టెంట్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్లలోని గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఇకపై తెలుగులోనూ సమాధానమివ్వనుంది. ‘‘ఓకే గూగుల్’’ అన్న ఇంగ్లిషు పదాలకు మాత్రమే స్పందించే వాయిస్ అసిస్టెంట్‌ను తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ పనిచేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. హిందీలో మాట్లాడాలనుకుంటే ‘‘ఓకే గూగుల్ హిందీ బోలో’అని కానీ.. ‘‘టాక్ టు మీ ఇన్ హిందీ’’ అనిగానీ పలకాల్సి ఉంటుందని, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ స్పందించేలా గూగుల్ అసిస్టెంట్‌ను ఆధునికీకరించినట్లు గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మాన్యుల్ బ్రాన్‌స్టీన్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త భాషలు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లతోపాటు ఆండ్రాయిడ్ గో, కియో పరికరాల్లో అందుబాటులోకి రానున్నాయని బ్రాన్‌స్టీన్ చెప్పారు. ఒక భాషలోంచి ఇంకో భాషకు తర్జుమా చేయగల గూగుల్ ఇంటర్ప్రెటర్ సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. -
గూగుల్ వాయిస్ సెర్చ్‌లో మన యాసలకూ చోటు!
న్యూఢిల్లీ: గూగుల్ వాయిస్ సెర్చ్.. తెలుగులో చెప్పాలంటే గూగుల్ స్వర శోధన. దీన్ని వాడాలనుకున్నా.. వాడలేక ఇబ్బందిపడుతున్న భారతీయులకు శుభవార్త. ఇకపై తమ ‘గూగుల్ వాయిస్ సెర్చ్’ భారతీయ యాసలు, ఉచ్చారణలను కూడా సులభంగా గుర్తించగలదని గూగుల్ మంగళవారం వెల్లడించింది. గూగుల్ వాయిస్ సెర్చ్ అన్నది ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారికి బాగా సుపరిచితమైన శోధనా అప్లికేషన్. మనం గూగుల్లోగాని, ఫోన్లోగాని ఏదైనా వెతకాలంటే అక్షరాలు టైప్ చేయాల్సిన పని లేకుండా కేవలం నోటి మాటతో చెబితే చాలు ‘గూగుల్ వాయిస్ సెర్చ్’ వెంటనే మనకు వెతికిపెడుతుంది. అయితే దీనికో చిక్కొచ్చి పడింది. ఆంగ్లంలోనే మాట్లాడాల్సి వచ్చినప్పటికీ.. మన భారతీయ ఉచ్చారణ, యాసలను సరిగా గుర్తించలేకపోయేది. ఇకపై ఆ సమస్య లేకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశామని, ఆంగ్లాన్ని మన యాసలో మాట్లాడినా అది గుర్తిస్తుందని గూగుల్ ఇండియా మార్కెటింగ్ విభాగాధిపతి సందీప్ మీనన్ తెలిపారు.