న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లలోని గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఇకపై తెలుగులోనూ సమాధానమివ్వనుంది. ‘‘ఓకే గూగుల్’’ అన్న ఇంగ్లిషు పదాలకు మాత్రమే స్పందించే వాయిస్ అసిస్టెంట్‌ను తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ పనిచేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. హిందీలో మాట్లాడాలనుకుంటే ‘‘ఓకే గూగుల్ హిందీ బోలో’అని కానీ.. ‘‘టాక్ టు మీ ఇన్ హిందీ’’ అనిగానీ పలకాల్సి ఉంటుందని, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ స్పందించేలా గూగుల్ అసిస్టెంట్‌ను ఆధునికీకరించినట్లు గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మాన్యుల్ బ్రాన్‌స్టీన్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త భాషలు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లతోపాటు ఆండ్రాయిడ్ గో, కియో పరికరాల్లో అందుబాటులోకి రానున్నాయని బ్రాన్‌స్టీన్ చెప్పారు. ఒక భాషలోంచి ఇంకో భాషకు తర్జుమా చేయగల గూగుల్ ఇంటర్‌ప్రెటర్ సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment