గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి
కర్నూలు (బేతంచర్ల): మురికి గుంతలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా బేతంచర్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కమలాబాయి, గోపాల్ బాయిలు దంపతులు. వీరికి 11 నెలల కూతురు అఖిల ప్రియ ఉంది.
అయితే వీరు మార్బుల్ పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం వీరి కూతురు అఖిల ప్రియ కూడా వీరితో పాటు వచ్చింది. వీరు పరిశ్రమలో పనిచేస్తుండగా చిన్నారి ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందింది.