గోపాలమిత్ర సూపర్వైజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఖాళీగా ఉన్న 7 గోపాలమిత్ర సూపర్వైజర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 30 మంది అభ్యర్థులకు గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్థానిక జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్డీఏ) కార్యాలయంలో ఈఓ డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన ఇంటర్వ్యూలను పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ పర్యవేక్షించారు.
ఎంపిక చేసిన 10 మంది అభ్యర్థుల జాబితాను ఏపీఎల్డీఏ సీఈఓ డాక్టర్ కొండలరావుకు పంపినట్లు ఈఓ తెలిపారు. రెండు మూడు రోజుల్లో అర్హుల జాబితా వస్తుందన్నారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న 70 గోపాలమిత్రల పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు.