శ్రీకాళహస్తిలో వ్యక్తిని హత్య చేసిన దుండగులు
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో గోపీ అనే వ్యక్తిని కొందరు దుండగులు హత్య చేశారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గోపీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మృతుడు శ్రీకాళహస్తి పట్టణంలో ఆప్టికల్ షాపు నిర్వహిస్తున్నాడని తెలిపారు. మృతుడికి సంబంధించి వివరాల కోసం కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.