Goshamahal stadium
-
గోషామహల్ స్టేడియంలో పోలీసుల స్పోర్ట్స్ మీట్ (ఫోటోలు)
-
గత మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక.. ఇది మామూలు తెలంగాణ కాదు.. బంగారు తెలంగాణ.. కొలువుల తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో వ్యాఖ్యలు చేసిందని, తమ మనో వేదనను అర్థం చేసుకోండంటూ గ్రూప్-2 అభ్యర్థులు వాపోతున్నారు. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక కూడా ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదని కొందరు తమ ఆవేదనను మీడియాకు వివరించారు. ‘2016 నవంబర్ 11, 13 తేదీలలో తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించగా, రాష్ట్ర ఆవిర్భావం రోజు 2017 జూన్ 2న ఫలితాలొచ్చాయి. కానీ గత ఏడాది నుంచి గ్రూప్-2 నియామకాలలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ.. గత మూడేళ్లుగా ఎంతో నరకం అనుభవిస్తున్నాం. సీఎం కేసీఆర్ గారిని కలిసి మా బాధ చెప్పుకోవడానికి ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రగతి భవన్‌కు వెళ్లాం. గతంలో కూడా ఇదే తీరుగా అభ్యర్థులను అరెస్ట్ చేసి గోషా మహల్ స్టేడియానికి తరలించారు. నేడు (మే 30న) మూడో పర్యాయం కేసీఆర్‌ను కలిసి నియామకాలను ముందుకు తీసుకెళ్లాలని కోరేందుకు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 300 మంది అభ్యర్థులం ఇక్కడికి వచ్చాం. 100 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ ఈసారి కూడా ప్రగతి భవన్ దగ్గరికి చేరుకోకముందే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి గోషా మహల్ స్టేడియానికి తరలించారు. కొద్దిసేపు అరెస్ట్ చేసి వదిలేద్దాం అనుకుంటున్నారు. కానీ మౌనదీక్ష ద్వారా శాంతీయుతంగా మా నిరసనను తెలియజేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఎన్ని రోజులు అయినా కూడా 300 మంది ఎంపికైన అభ్యర్థులం గోషా మహల్ స్టేడియంలోనే మౌనదీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం. మీడియా సహకారంతో మా సమస్య తీవ్రతను తెలియజేస్తున్నామని’ కొందరు అభ్యర్థులు వివరించారు. తమ ఆవేదనను వ్యక్తం చేసిన గ్రూప్ 2 అభ్యర్థుల్లో కొందరు 1. విక్రమ్ - 9849505084 2. ఇమ్రాన్ - 9703475217 3. గీతా రెడ్డి - 8328018263 4. సనత్ -9908940271 5. ప్రమోద్ - 9490288882 6. రమణ -9885329349 7. విక్రమ్- 9014813121 8. నాగార్జున - 9154991208 9. జ్యోతి రెడ్డి - 9848329008 10. స్రవంతి - 9948855308 -
గోషామహల్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు
-
అంతులేని వేదన
గోషామహల్ స్టేడియంలో ఘటన గతంలో రాష్ట్రపతి శౌర్యపతకం పొందిన సుధాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి రోజూలాగానే ఉదయాన్నే పరేడ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ సుధాకర్ గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్థానికులూ విషాదంలో మునిగిపోయారు. అఫ్జల్‌గంజ్,బంజారాహిల్స్,మలేషియా టౌన్షిప్: పోలీస్ పరేడ్‌లో పాల్గొన్న కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలి, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటన శనివారం ఉదయం గోషామహల్ పోలీసు స్టేడియంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ సత్తెనపల్లి గ్రామానికి గడ్డిపాటి సుధాకర్ (42) బంజారాహిల్స్ ఠాణాలో కానిస్టేబుల్ (ఐడీపార్టీ)గా విధులు నిర్వహిస్తున్నాడు. గోషామహల్ పోలీసు స్టేడియంలో వారినికోసారి పోలీసులకు జరిగే పరేడ్‌లో పాల్గొనేందుకు శనివారం ఉదయం 6 గంటలకు గ్రౌండ్‌కు చేరుకున్నాడు. ఏడు గంటలకు పరేడ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే గుండెపోటు రావడంతో సుధాకర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గమనించిన సహచర సిబ్బంది అతడ్ని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలివచ్చారు. వారి రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో హోరెత్తింది. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు, అడిషనల్ డీసీపీ నాగరాజు, గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు, ఇన్స్పెక్టర్ సత్తయ్యగౌడ్, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపీరెడ్డి, నేతలు ఎన్.శంకర్‌రెడ్డి, మాధవరెడ్డి, ప్రకాష్, సూరిలు కేర్ ఆసుపత్రికి చేరుకుని కానిస్టేబుల్ సుధాకర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాల ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి సుధాకర్ మృతి శోచనీయమని, అతడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యవంత జీవనం గడిపేందుకు ఇటీవలే పోలీసు సిబ్బందికి యోగా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. సుధాకర్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కేర్ ఆసుపత్రి నుంచి స్వగృహానికి తరలించారు. విషాదఛాయలు... సుధాకర్ మృతితో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే పోలీసులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి. మురళీకృష్ణ కంటనీరు పెట్టుకున్నారు. కూకట్‌పల్లిలోని ఆయన ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సుధాకర్ 15 సంవత్సరాలుగా కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుధాకర్‌కు భార్య శ్యామల, ప్రభాస్, లక్కి ఇద్దరు కుమారులు ఉన్నారు. 1998 బ్యాచ్‌కు చెందిన సుధాకర్ గతంలో రాంగోపాల్‌పేట పంజాగుట్ట, సికింద్రాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో విధులు నిర్వహించాడు. పార్క్ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనలో వీరోచితంగా పోరాడి రోగులను రక్షించినందుకు రాష్ట్రపతి శౌర్యపతకం వచ్చింది. మూడు హత్య కేసులు ఛేదించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు సుధాకర్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపినట్లు కేపీహెచ్‌బీ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు జనగాం సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. -
పరేడ్ నిర్వహిస్తు కుప్పకూలిన కానిస్టేబుల్
-
పోలీసు పరేడ్ ... కుప్పకూలిన కానిస్టేబుల్
హైదరాబాద్: నగరంలో గోషామహాల్ స్టేడియంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పరేడ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్ అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది ... దాంతో అతడు కుప్పకూలిపోయాడు. సహాచరులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సుధాకర్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. సుధాకర్ స్వస్థలం గుంటూరు జిల్లా. ఆయన 1998 పోలీసు శాఖలో చేరారు. విధుల్లో ఎల్లప్పుడు చురుగ్గా వ్యవహారించే సుధాకర్ ఆకస్మిక మరణించడంతో సహచరులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి సుధాకర్ పలు మెడల్స్ అందుకున్నారు.