
పోలీసు పరేడ్ ... కుప్పకూలిన కానిస్టేబుల్
హైదరాబాద్: నగరంలో గోషామహాల్ స్టేడియంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పరేడ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్ అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది ... దాంతో అతడు కుప్పకూలిపోయాడు. సహాచరులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సుధాకర్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
సుధాకర్ స్వస్థలం గుంటూరు జిల్లా. ఆయన 1998 పోలీసు శాఖలో చేరారు. విధుల్లో ఎల్లప్పుడు చురుగ్గా వ్యవహారించే సుధాకర్ ఆకస్మిక మరణించడంతో సహచరులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి సుధాకర్ పలు మెడల్స్ అందుకున్నారు.