
పేరేచర్ల: మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సూరవరపు కోటేశ్వరరావు(53)శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. నాలుగేళ్ల నుంచి ఇక్కడి స్టేషన్‌లో ఆయన పని చేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం సెంట్రీగా విధులు నిర్వర్తించిన ఆయన శనివారం ఉదయం పోలీస్ క్వార్టర్స్‌లో తన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడే కుప్ప కూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు సమగ్ర ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కోటేశ్వరరావు స్వస్థలం అనంతవరప్పాడు కాగా ఎనిమిదేళ్ల నుంచి తాలూకాలోని పోలీస్ క్వార్టర్స్‌లో భార్యాపి ల్లలతో ఉంటున్నారు. 29 సంవత్సరాల సర్వీస్‌లో విధులు సక్రమంగా నిర్వర్తించినందుకు గాను మూడుసార్లు హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చినా తిరస్కరించారు. స్టేషన్‌లో ఎక్కువగా రాత్రి గస్తీలు చేసే కోటేశ్వరరావు విధుల్లో అలసత్వం వహించకుండా తన పని సక్రమంగా నిర్వర్తించే వాడని సహచర సిబ్బంది కొనియాడారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment