గత మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నాం! | Telangana Group 2 Selected Canditates Problems | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-2 అభ్యర్థుల మనోవేదన ఇది..

Published Wed, May 30 2018 11:23 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Telangana Group 2 Selected Canditates Problems - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక.. ఇది మామూలు తెలంగాణ కాదు.. బంగారు తెలంగాణ.. కొలువుల తెలంగాణ అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో వ్యాఖ్యలు చేసిందని, తమ మనో వేదనను అర్థం చేసుకోండంటూ గ్రూప్‌-2 అభ్యర్థులు వాపోతున్నారు. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక కూడా ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదని కొందరు తమ ఆవేదనను మీడియాకు వివరించారు. 

‘2016 నవంబర్‌​ 11, 13 తేదీలలో తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించగా, రాష్ట్ర ఆవిర్భావం రోజు 2017 జూన్‌ 2న ఫలితాలొచ్చాయి. కానీ గత ఏడాది నుంచి గ్రూప్‌-2 నియామకాలలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ.. గత మూడేళ్లుగా ఎంతో నరకం అనుభవిస్తున్నాం. సీఎం కేసీఆర్‌ గారిని కలిసి మా బాధ చెప్పుకోవడానికి ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రగతి భవన్‌కు వెళ్లాం. గతంలో కూడా ఇదే తీరుగా అభ్యర్థులను అరెస్ట్‌ చేసి గోషా మహల్‌ స్టేడియానికి తరలించారు. నేడు (మే 30న) మూడో పర్యాయం కేసీఆర్‌ను కలిసి నియామకాలను ముందుకు తీసుకెళ్లాలని కోరేందుకు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 300 మంది అభ్యర్థులం ఇక్కడికి వచ్చాం.

100 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ ఈసారి కూడా ప్రగతి భవన్‌ దగ్గరికి చేరుకోకముందే పోలీసులు మమ్మల్ని అరెస్ట్‌ చేసి గోషా మహల్‌ స్టేడియానికి తరలించారు. కొద్దిసేపు అరెస్ట్‌ చేసి వదిలేద్దాం అనుకుంటున్నారు. కానీ మౌనదీక్ష ద్వారా శాంతీయుతంగా మా నిరసనను తెలియజేస్తాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఎన్ని రోజులు అయినా కూడా 300 మంది ఎంపికైన అభ్యర్థులం గోషా మహల్‌ స్టేడియంలోనే మౌనదీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం. మీడియా సహకారంతో మా సమస్య తీవ్రతను తెలియజేస్తున్నామని’ కొందరు అభ్యర్థులు వివరించారు.

తమ ఆవేదనను వ్యక్తం చేసిన గ్రూప్‌ 2 అభ్యర్థుల్లో కొందరు
1. విక్రమ్ - 9849505084

2. ఇమ్రాన్ - 9703475217

3. గీతా రెడ్డి - 8328018263

4. సనత్ -9908940271

5. ప్రమోద్ - 9490288882

6. రమణ -9885329349

7. విక్రమ్- 9014813121

8. నాగార్జున - 9154991208

9. జ్యోతి రెడ్డి - 9848329008

10. స్రవంతి - 9948855308

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement