group-2 candidates
-
‘ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య’
సాక్షి, ఢిల్లీ: గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన వరంగల్ విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళసై నివేదిక కోరగా, ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘ప్రవల్లికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య. సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దీనిపై స్పందించాలి. తెలంగాణ యువత సీఎం కేసీఆర్‌ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం -
ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్/వరంగల్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 23 ఏళ్ల ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఆమె మృతిపట్ల ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్, టీఎస్పీఎస్సీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ‘గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక అకాల మరణం.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువ ఔత్సాహికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిళ్లను గుర్తుచేస్తుంది. గ్రూప్2కు సన్నద్ధమవుతున్న ప్రవళిక.. ఉద్యోగ పరీక్షల వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు. విద్యార్థులు దైర్యంగా ఉండండి. నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక పంపాలి’ అంటూ తమిళిసై పేర్కొన్నారు.. అంతిమయాత్రలో స్పల్ప ఉద్రిక్తత వరంగల్‌లోని దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలో నిర్వహించిన ప్రవళిక అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేయూ, ఓయూ జేఏసీ విద్యార్థుల ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి జేఏసీ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థుల చొక్కాలు చినిగాయి. కాగా గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన ప్రవళిక అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వరంగల్‌కు చెందిన ప్రవల్లిక(23) అశోక్ నగర్‌లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ గ్రూప్–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రవల్లిక తానుంటున్న హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్స్పెక్టర్ పి.నరేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్ లెటర్ బయటపెట్టాలని కోరారు. తల్లిదండ్రుల కన్నీటి పర్యంతం గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యతో ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా బిక్కాజిపల్లిలో విషాదం అలుముకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. జయ- లింగయ్య దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కాగా..కూతురు ప్రవళిక ఉన్నత విద్యను అభ్యసించి గ్రూప్-2ప్రిపేర్ కోసం హైదరాబాద్ హాస్ట్‌లో ఉంటుంది. ప్రవళిక అంతిమయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఓయు, కేయు జేఏసీ ప్రతినిదులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యా అని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల ఎక్సిగ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
గత మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక.. ఇది మామూలు తెలంగాణ కాదు.. బంగారు తెలంగాణ.. కొలువుల తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో వ్యాఖ్యలు చేసిందని, తమ మనో వేదనను అర్థం చేసుకోండంటూ గ్రూప్-2 అభ్యర్థులు వాపోతున్నారు. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక కూడా ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదని కొందరు తమ ఆవేదనను మీడియాకు వివరించారు. ‘2016 నవంబర్ 11, 13 తేదీలలో తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించగా, రాష్ట్ర ఆవిర్భావం రోజు 2017 జూన్ 2న ఫలితాలొచ్చాయి. కానీ గత ఏడాది నుంచి గ్రూప్-2 నియామకాలలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ.. గత మూడేళ్లుగా ఎంతో నరకం అనుభవిస్తున్నాం. సీఎం కేసీఆర్ గారిని కలిసి మా బాధ చెప్పుకోవడానికి ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రగతి భవన్‌కు వెళ్లాం. గతంలో కూడా ఇదే తీరుగా అభ్యర్థులను అరెస్ట్ చేసి గోషా మహల్ స్టేడియానికి తరలించారు. నేడు (మే 30న) మూడో పర్యాయం కేసీఆర్‌ను కలిసి నియామకాలను ముందుకు తీసుకెళ్లాలని కోరేందుకు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 300 మంది అభ్యర్థులం ఇక్కడికి వచ్చాం. 100 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ ఈసారి కూడా ప్రగతి భవన్ దగ్గరికి చేరుకోకముందే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి గోషా మహల్ స్టేడియానికి తరలించారు. కొద్దిసేపు అరెస్ట్ చేసి వదిలేద్దాం అనుకుంటున్నారు. కానీ మౌనదీక్ష ద్వారా శాంతీయుతంగా మా నిరసనను తెలియజేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఎన్ని రోజులు అయినా కూడా 300 మంది ఎంపికైన అభ్యర్థులం గోషా మహల్ స్టేడియంలోనే మౌనదీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం. మీడియా సహకారంతో మా సమస్య తీవ్రతను తెలియజేస్తున్నామని’ కొందరు అభ్యర్థులు వివరించారు. తమ ఆవేదనను వ్యక్తం చేసిన గ్రూప్ 2 అభ్యర్థుల్లో కొందరు 1. విక్రమ్ - 9849505084 2. ఇమ్రాన్ - 9703475217 3. గీతా రెడ్డి - 8328018263 4. సనత్ -9908940271 5. ప్రమోద్ - 9490288882 6. రమణ -9885329349 7. విక్రమ్- 9014813121 8. నాగార్జున - 9154991208 9. జ్యోతి రెడ్డి - 9848329008 10. స్రవంతి - 9948855308 -
ఏపీపీఎస్సీ.. ఎవరిమాటా వినదు!
సాక్షి, అమరావతి: గ్రూప్–2 (2016) నియామకాలకు సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకొన్న వేలాది మంది అభ్యర్థులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుతో తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. 982 పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ గ్రూప్–2పై ఆది నుంచి అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ పరీక్షల్లో లోపాలపై తమ అభ్యర్థనలను కమిషన్ వినలేదని, చివరకు పరీక్షలు, ఫలితాల వెల్లడి అనంతరం అభ్యంతరాలనూ పట్టించుకోవడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించామని, కేసులు పరిష్కారమై తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్న సమయంలో కమిషన్ తమకు అన్యాయం చేస్తోందని వాపోతున్నారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నా కమిషన్ తుది ఫలితాలను ప్రకటించడమే కాకుండా నియామకాలకు ముందుకు వెళ్లడంతో తమకు దిక్కుతోచడం లేదని వారంటున్నారు. ఆది నుంచీ వివాదాలే.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 25 వేల మంది దాటడంతో ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఇందులో రిజర్వేషన్లు పాటించకపోవడంతో ఆయా వర్గాలకు నష్టం వాటిల్లుతుందని ముందే అభ్యంతరాలు వచ్చినా కమిషన్ పట్టించుకోలేదు. మెయిన్స్‌లో మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారిని ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో భర్తీ చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా ఏపీపీఎస్సీ వారిని రిజర్వుడ్ కోటాలోనే ఉంచేస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ రిజర్వుడ్ అభ్యర్థిని ఓపెన్ కేటగిరీలోకి పంపితే రిజర్వుడ్ కోటాలో ఆ తదుపరి అభ్యర్థికి అవకాశం దక్కుతుంది. కమిషన్ తీరు వల్ల రిజర్వుడ్ వర్గాల అవకాశాలు దెబ్బతింటున్నాయి. గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహణలో అనేక సమస్యలు, ఆన్లైన్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తి గందరగోళం ఏర్పడింది. చివరకు ప్రిలిమ్స్‌ను 3 నెలల వ్యవధి ఇచ్చి నిర్వహించారు. ప్రిలిమ్స్ కంటే అనేక సబ్జెక్టులు మెయిన్స్‌లో ఉన్నా కమిషన్ కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇవ్వడంతో ఆందోళనలు రేగాయి. ప్రామాణిక పుస్తకాలు కూడా లేక అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. గ్రూప్–2ను జోనల్ స్థాయి పరీక్షగా పేర్కొన్నా కటాఫ్‌ను నిర్ణయించేటప్పుడు రాష్ట్ర స్థాయిగా చూపడంతో రాష్ట్రానికి చెందిన పలువురు అభ్యర్థులు నష్టపోయారు. మెయిన్స్‌లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు మెయిన్స్ పరీక్ష నిర్వహణలోనూ లోపాలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నంతో సహా కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చాయి. ఈ సమస్యలపై తమ అభ్యర్థనలను కమిషన్ పట్టించుకోకపోవడంతో పలువురు ఆందోళనలు చేయగా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని కమిషన్ వెబ్‌నోట్ విడుదల చేసింది. మెయిన్స్‌లో జరిగిన లోపాలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. స్టే ఎత్తేయడం వల్లే నియామకాలు: ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ గ్రూప్–2కు సంబంధించి న్యాయస్థానంలో దాఖలైన కేసులపై స్టేను ఎత్తేయడంతో నియామకాలు చేపట్టామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. ఆయా కేసులున్న పోస్టు కోడ్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటుందన్న షరతులతోనే తుది జాబితాను విడుదల చేశామన్నారు. -
గ్రూప్–2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్ : రాయలసీమ జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల్లో గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో ఎంపికైన ఎస్సీ కులాలు, బీసీ–సీ విద్యార్థులకు మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్ విజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 31లో అందజేయాలని తెలిపారు. మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. వీరికి తిరుపతిలోని డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, శ్రీ విద్యా ఐఏఎస్ అకాడమిలో శిక్షణ ఇస్తారని వివరించారు. కుటుంబ వార్షికాదాయం రూ. 2 లక్షలలోపు ఉండాలని వివరించారు. గ్రూప్–2 ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నంబరు, ప్రిలిమ్స్‌లో పొందిన మార్కులు, కుల ధ్రువీకరణపత్రం, తెల్లరేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణపత్రం, నివాస ధ్రువీకరణపత్రం, 40 శాతంపైన వికలత్వం ఉన్న దివ్యాంగులు ధ్రువీకరణపత్రం జత చేయాలని సూచించారు. హెల్ప్‌లైన్ నంబరు 1800–425–1877 ఫోన్ చేసి మరింత సమాచారం పొందవచ్చునని తెలిపారు.