అనంతపురం ఎడ్యుకేషన్ : రాయలసీమ జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల్లో గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో ఎంపికైన ఎస్సీ కులాలు, బీసీ–సీ విద్యార్థులకు మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్ విజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 31లో అందజేయాలని తెలిపారు. మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. వీరికి తిరుపతిలోని డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, శ్రీ విద్యా ఐఏఎస్ అకాడమిలో శిక్షణ ఇస్తారని వివరించారు.
కుటుంబ వార్షికాదాయం రూ. 2 లక్షలలోపు ఉండాలని వివరించారు. గ్రూప్–2 ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నంబరు, ప్రిలిమ్స్‌లో పొందిన మార్కులు, కుల ధ్రువీకరణపత్రం, తెల్లరేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణపత్రం, నివాస ధ్రువీకరణపత్రం, 40 శాతంపైన వికలత్వం ఉన్న దివ్యాంగులు ధ్రువీకరణపత్రం జత చేయాలని సూచించారు. హెల్ప్‌లైన్ నంబరు 1800–425–1877 ఫోన్ చేసి మరింత సమాచారం పొందవచ్చునని తెలిపారు.
గ్రూప్–2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ
Published Mon, May 29 2017 12:14 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement