Telangana groups Candidates
-
గత మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక.. ఇది మామూలు తెలంగాణ కాదు.. బంగారు తెలంగాణ.. కొలువుల తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో వ్యాఖ్యలు చేసిందని, తమ మనో వేదనను అర్థం చేసుకోండంటూ గ్రూప్-2 అభ్యర్థులు వాపోతున్నారు. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక కూడా ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదని కొందరు తమ ఆవేదనను మీడియాకు వివరించారు. ‘2016 నవంబర్ 11, 13 తేదీలలో తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించగా, రాష్ట్ర ఆవిర్భావం రోజు 2017 జూన్ 2న ఫలితాలొచ్చాయి. కానీ గత ఏడాది నుంచి గ్రూప్-2 నియామకాలలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ.. గత మూడేళ్లుగా ఎంతో నరకం అనుభవిస్తున్నాం. సీఎం కేసీఆర్ గారిని కలిసి మా బాధ చెప్పుకోవడానికి ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రగతి భవన్‌కు వెళ్లాం. గతంలో కూడా ఇదే తీరుగా అభ్యర్థులను అరెస్ట్ చేసి గోషా మహల్ స్టేడియానికి తరలించారు. నేడు (మే 30న) మూడో పర్యాయం కేసీఆర్‌ను కలిసి నియామకాలను ముందుకు తీసుకెళ్లాలని కోరేందుకు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 300 మంది అభ్యర్థులం ఇక్కడికి వచ్చాం. 100 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ ఈసారి కూడా ప్రగతి భవన్ దగ్గరికి చేరుకోకముందే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి గోషా మహల్ స్టేడియానికి తరలించారు. కొద్దిసేపు అరెస్ట్ చేసి వదిలేద్దాం అనుకుంటున్నారు. కానీ మౌనదీక్ష ద్వారా శాంతీయుతంగా మా నిరసనను తెలియజేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఎన్ని రోజులు అయినా కూడా 300 మంది ఎంపికైన అభ్యర్థులం గోషా మహల్ స్టేడియంలోనే మౌనదీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం. మీడియా సహకారంతో మా సమస్య తీవ్రతను తెలియజేస్తున్నామని’ కొందరు అభ్యర్థులు వివరించారు. తమ ఆవేదనను వ్యక్తం చేసిన గ్రూప్ 2 అభ్యర్థుల్లో కొందరు 1. విక్రమ్ - 9849505084 2. ఇమ్రాన్ - 9703475217 3. గీతా రెడ్డి - 8328018263 4. సనత్ -9908940271 5. ప్రమోద్ - 9490288882 6. రమణ -9885329349 7. విక్రమ్- 9014813121 8. నాగార్జున - 9154991208 9. జ్యోతి రెడ్డి - 9848329008 10. స్రవంతి - 9948855308 -
చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు
* తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ బ్రహ్మణి ప్రకటన * దీంతో ఏపీలో ఉద్యోగ ప్రకటనలు లేవని చెప్పినట్లయిందని బాబు మథనం హైదరాబాద్: తన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరకాటంలో పడ్డారని తెలిసింది. ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట కూడా. ఇంతలా చంద్రబాబును ఇబ్బందుల్లో పడేసే విధంగా ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటన ఏంటంటే...? తెలంగాణలో గ్రూప్ 1, 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో 60 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని ఈ మధ్యనే విలేకరుల సమావేశంలో ప్రకటించారు. శిక్షణ పొందాలనుకున్న వారు ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బ్రహ్మణి ప్రకటనతో చంద్రబాబు సంకట పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకంటే విభజన అనంతరం తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల్లో ప్రస్తుతం 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వస్తున్నప్పటికీ ఆయనపట్టించుకోవడం లేదు. పైగా అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరోపక్క కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా దక్కినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్న బ్రహ్మణి ప్రకటనతో అటు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు.. మరోవైపు ఏపీలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోతున్నట్లు ప్రజలకు తామే చెప్పినట్లయిందని చంద్రబాబు మథనపడ్డారట. బ్రహ్మణి ప్రకటనతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్న విషయాన్ని ఎత్తిచూపినట్టయిందని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు.