ప్రాణం తీసిన సరదా....
జలపాతం వద్ద నీటిలో పడి విద్యార్థి మృతి
పెద్దపల్లిరూరల్: దసరా సెలవుల్లో స్నేహితులతో సరదాగా గడిపేందుకు గౌరిగుండాల జలపాతం వద్దకు వచ్చిన ఓ విద్యార్థి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సబ్బితం పంచాయతీ పరిధిలోని గౌరిగుండాలు జలపాతం వద్దకు గోదావరిఖనికి చెందిన పదో తరగతి విద్యార్థి రాహుల్ నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం వచ్చాడు. జలపాతం వద్ద నీటిలో సరదాగా ఆడుకుంటున్న రాహుల్ నీటిలో మునిగి ఊపిరాడక మరణించాడు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. బసంత్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.