అరటి చెట్టు నుంచి విద్యుత్
గౌరీపట్నం(దేవరపల్లి), న్యూస్‌లైన్: ఈ నెల 23న ఏలూరు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ హైస్కూలు విద్యార్థులు చూపిన ప్రదర్శనకు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. అరటి చెట్టి నుంచి విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారు. అడవుల్లోను. రోడ్డు పక్కన గల పాలు కారే చెట్లు నుంచి విద్యుత్ బల్బులను వెలిగించవచ్చునని ప్రదర్శించారు. లీడర్ కేవీవీఆర్ఎస్ విష్ణుకు సహయలీడర్ ఎ.లఖిల, విద్యార్థులు ఎ.దుగ్గిరాజు, డి.రాజేష్, కె. వెంకటేష్ ఈప్రాజెక్టును తయారు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఆర్. ప్రసాద్ సహకరించారు.విదార్థులను ఎంఈవో జి.రత్నకుమార్, ఉపాధ్యాయులు అభినంధించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికైందని ఉపాధ్యాయుడు రాజు తెలిపారు.