విశాఖ జిల్లాలో ఓ వ్యక్తి కిడ్నాప్!
Published Tue, Sep 16 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
చోడవరం: విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం గౌరీపట్నంలో కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. గేదెల సూర్యనారాయణ అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగురోజుల నుంచి తన సోదరుడు కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.
తన సోదరుడు సూర్యనారాయణను చంపి గౌరీపట్నం పొలాల్లో పూడ్చారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు.
Advertisement
Advertisement