governament doctors
-
ప్రభుత్వ వైద్యుల సమ్మె ప్రారంభం
కామారెడ్డి టౌన్ : డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వ వైద్యులు బుధవారం సమ్మెను ప్రారంభించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు వైద్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్విస్ కోటాను రద్దు చేస్తు ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని, ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, అర్హులైన వైద్యులకు పదోన్నతులు కల్పించాలని, ఉస్మానియాకు నూతన భవనం నిర్మించాలని, యూజీసీ పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధులకు ఆటంకం కలుగకుండా గంట పాటు ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఏవీ. శ్రీనివాస్, తదితరులున్నారు. సమావేశం బహిష్కరించి.. డివిజన్ స్థాయి పీహెచ్సీ అధికారు లు, వైద్యుల సమావేశాన్ని స్థానిక వి శ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ప్రభుత్వ వైద్యులు బహిష్కరించారు. ఈ నిరస నలో ఆయా పీహెచ్సీల మెడికల్ ఆఫీ సర్లు ప్రవీణ్, రవీందర్ ఉన్నారు. -
అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా..
విజయవాడ : విజయవాడలో అంత్యక్రియలకు సిద్దం చేస్తుండగా బాలిక తిరిగి బతికిందనే వార్త సంచలనం సృష్టించింది. దీంతో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వివరణ ఇవ్వాల్సివచ్చింది. అసలు ఏం జరిగిందంటే ? రాజరాజేశ్వరి పేటకి చెందిన సాయి దుర్గ అనే బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి సాయి దుర్గ మరణించినట్లు ధృవీకరించారు. సాయిదుర్గ చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కన్నీరుమున్నీరైన బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంతలోనే బాలిక కదిలిందంటూ చెప్పడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. బతికున్న బాలికను చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటూ ఆసుపత్రి సిబ్బందిపై బాలిక బంధువులు మండిపడ్డారు. అయితే శుక్రవారం సాయంత్రమే సాయి దుర్గ మృతి చెందిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ చక్రధర్ సాయి తెలిపారు. అయినా డాక్టర్లతో మరోసారి ధృవీకరించామన్నారు. కుటుంబ సభ్యుల అపోహల కారణంగానే ఈ గందరగోళం జరిగిందన్నారు. ప్రయివేటు అంబులెన్స్ డ్రైవర్ చేసిన నిర్వాకంపై విచారణ చేపడతామన్నారు. ప్రయివేటు ఆర్ ఎంపీ వైద్యురాలు బాలిక బతికుందని చెప్పడంతో అసలు గందరగోళం తలెత్తిందని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలు ప్రాణాలు కాపాడానికే ఉన్నాయి. తీయడానికి కాదని చక్రధర్ సాయి అన్నారు. బాలిక చనిపోయింది కాబట్టే నాలుగు ఆసుపత్రిల చుట్టూ తిప్పినా వైద్యం చేయడానికి ఎవరు ముందుకు రాలేదని తెలిపారు. ఈ ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ డీఎమ్ఈని విచారణకు ఆదేశించారు. -
ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కోతే!
సాక్షి, ముంబై: ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్న వైద్యుల జీతాల్లో కోత విధించాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయించింది. అదనపు సంపాదనమీద ఆశతో ఇప్పటికే ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ విధులను నిర్లక్ష్యం చేస్తున్న కొందరిని బీఎంసీ హెచ్చరించినా వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదు. ప్రభుత్వ, బీఎంసీ ఆస్పత్రుల్లో పనిచేసే అనేక మంది వైద్యులకు సొంతంగా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోంలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ బినామీ పేర్లతో వాటిని నడుపుతున్నారు. కాగా బీఎంసీ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు మాత్రం డ్యూటీ అయిపోయిన తరువాత ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసుకునే అవకాశముంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆస్పత్రిలో కచ్చితంగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కాని అనేక మంది డాక్టర్లు సొంత ఆస్పత్రి నుంచి నుంచి ఫోన్ రాగానే వెళ్లిపోతున్నారు. కొందరైతే అక్కడ పనులు ముగించుకుని ఆలస్యంగా ఆస్పత్రికి వస్తున్నారు. మరికొందరు నాలుగు గంటలకు ముందే వెళ్లిపోతున్నారు. దీంతో వార్డులో రోగులకు సరైన వైద్యం లభించడంలేదంటూ బీఎంసీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీనిని సీరియస్గా తీసుకున్న బీఎంసీ ఆస్పత్రి యాజమాన్యాలు హాజరు పుస్తకాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం రాగానే, సాయంత్రం వెళ్లేటప్పుడు అందులో కచ్చితంగా సంతకం చేయాలని ఆంక్షలు విధించింది. కాని కొందరు మధ్యలో మాయమై పనులు చూసుకుని తిరిగి వస్తున్నారు. ఇక వీరి ప్రవర్తనలో మార్పు రాదని గ్రహించిన బీఎంసీ.. పట్టుబడిన వైద్యుల జీతంలో కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇలాంటి డాక్టర్లపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నిఘా వేస్తారు. వారికి కేటాయించిన వార్డులో లేని పక్షంలో వేటు వేసే యోచనలో కూడా ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.