నిరసన తెలుపుతున్న వైద్యులు
కామారెడ్డి టౌన్ : డిమాండ్‌లను పరిష్కరించాలని ప్రభుత్వ వైద్యులు బుధవారం సమ్మెను ప్రారంభించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు వైద్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్విస్ కోటాను రద్దు చేస్తు ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని, ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, అర్హులైన వైద్యులకు పదోన్నతులు కల్పించాలని, ఉస్మానియాకు నూతన భవనం నిర్మించాలని, యూజీసీ పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధులకు ఆటంకం కలుగకుండా గంట పాటు ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఏవీ. శ్రీనివాస్, తదితరులున్నారు.
సమావేశం బహిష్కరించి..
డివిజన్ స్థాయి పీహెచ్‌సీ అధికారు లు, వైద్యుల సమావేశాన్ని స్థానిక వి శ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ప్రభుత్వ వైద్యులు బహిష్కరించారు. ఈ నిరస నలో ఆయా పీహెచ్‌సీల మెడికల్ ఆఫీ సర్లు ప్రవీణ్, రవీందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment