3,649 ఎకరాల ప్రైవేటు భూమి గుర్తించాం
ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దళితులకు భూపంపిణీ పథకం కింద కొనుగోలు చేసి కేటాయించేందుకు 3,649 ఎకరాల ప్రైవేట్ భూమిని గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమరంగ సలహాదారు రామలక్ష్మణ్ ‘సాక్షి’కి తెలి పారు. ఈ భూమి పంపిణీకి అనువుగా ఉందా లేదా అన్న అంశాన్ని మండ ల, జిల్లా యంత్రాంగం పరిశీలించాక, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వం కేటాయించిన ఈ మొత్తం భూముల కొనుగోలుకే కాకుండా లబ్ధిదారులైన రైతులకు ఇరిగేషన్ సౌకర్యాలు, మోటార్లు, పంపుసెట్లు, పైపులైన్లు అందించేందుకు ఉపయోగిస్తామన్నారు. ఈనెల 15 తర్వాత అధికారులపై ఒత్తిడి తగ్గి, పనులు వేగం పుంజుకుంటాయని చెప్పారు. ఇప్పటివరకు వంద ఎకరాల ప్రభుత్వ భూమి, 542 ఎకరాల ప్రైవేట్ భూమి కలిపి 642 ఎకరాలకు పైగా భూమిని 221 మందికి పైగా ఎస్సీ మహిళా రైతుల పేరిట రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలుకు ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసిందన్నారు.