వచ్చే నెల 18న టెన్త్ ఫలితాలు!
కుదరకపోతే 21-22 తేదీల్లో విడుదల.. కసరత్తు చేస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగం
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను వచ్చే నెల 18న విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఇటీవలే పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తిచేసిన అధికారులు ప్రస్తుతం స్కానింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ పని పూర్తయ్యేందుకు పది రోజుల సమయం పట్టనుండగా... వాటికి 20 శాతం ఇంటర్నల్ మార్కులను కలిపేందుకు మరో పది రోజుల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రక్రియ మొత్తాన్ని వచ్చే నెల 17 నాటికి పూర్తి చేయాలని... 18న ఫలితాలు విడుదల చే యాలని భావిస్తున్నారు. అయితే ఈసారి డాటా ప్రాసెస్ చేస్తున్న కంప్యూటర్ ఏజెన్సీ కొత్తది కావడంతో కొంత ఆలస్యమయ్యే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 18న ఫలితాల వెల్లడి వీలుకాకపోతే 21 లేదా 22వ తేదీన విడుదల చేసేందుకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది.