పరిశ్రమలకు పెట్టింది పేరు..
నిజాం పాలనా కాలంలోనే హైదరాబాద్ గొప్ప పరిశ్రమలకు పెట్టింది పేరు. ఆరో నిజాం హయాం నుంచి ఎన్నో ఫ్యాక్టరీలు నగరంలో వెలిశాయి. ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించాయి. ఆనాడు వెలిసిన ప్రముఖ పరిశ్రమల్లో కొన్ని.. 1874లో మొదటి స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటైంది. 1876లో ఫిరంగుల ఫ్యాక్టరీ, 1876లో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది.
1885లో బాలాపూర్ వద్ద ప్రైవేట్ పేపర్ ఫ్యాక్టరీ, 1903లో నారాయణగూడలో ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ, 1910లో రెండు మద్యం తయారీ పరిశ్రమలు (డిస్టిలరీ), 1910లో ఐరన్, సోడా ఫ్యాక్టరీలు, 1911లో మింట్ సమీపంలో పవర్ ప్లాంట్, 1916లో దక్కన్ బటన్ పరిశ్రమ, 1919లో వీఎస్టీ ఫ్యాక్టరీ, 1921లో కెమికల్ ల్యాబ్, 1927లో దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, 1929లో డీబీఆర్ మిల్స్, 1941లో గోల్కొండ సిగరెట్ కంపెనీలు ఏర్పాటు చేశారు.