
కర్నూలులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. అ ప్రమాదంలో ప్రింటింగ్ మెటీరియల్ కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది.
అయితే ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ప్రెస్ సిబ్బంది నోరుమెదపడం లేదు. వేస్ట్ పేపర్లు నిల్వచేసిన చోట మాత్రమే ప్రమాదం జరిగిందని బుకాయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment