
సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీఎం అండ్ హెచ్‌వో పరిసరాల్లోని వ్యాక్సిన్ శీతలీకరణ కేంద్రంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. శీతలీకరణ గది కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్టుగా తెలుస్తోంది. శీతలీకరణ కేంద్రంలో నిలువ ఉంచిన ఇంజక్షన్‌లు, ఇతర మెడిసిన్ దగ్ధం అవుతున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగనట్టు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment