DM&HO
-
ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అగ్ని ప్రమాదం
సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీఎం అండ్ హెచ్‌వో పరిసరాల్లోని వ్యాక్సిన్ శీతలీకరణ కేంద్రంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. శీతలీకరణ గది కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్టుగా తెలుస్తోంది. శీతలీకరణ కేంద్రంలో నిలువ ఉంచిన ఇంజక్షన్లు, ఇతర మెడిసిన్ దగ్ధం అవుతున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగనట్టు అధికారులు చెబుతున్నారు. -
తేలిన లెక్క
లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్ మొత్తం విస్తీర్ణం 6,575 చదరపు గజాలు. దాంట్లో భవన సముదాయాలు 4,895 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి. 40ఏళ్ల క్రితం గోషామహల్లో నిర్మించిన సరూర్‌నగర్ ఆర్డీఓ ఆఫీస్ 10,890 చదరపు అడుగుల్లో ఉంది. భవనం కాకుండా సుమారు 3వేల గజాల ఖాళీ స్థలం ఉంది. ఖైరతాబాద్‌లోని 2.425 ఎకరాల్లో జెడ్పీ ప్రాంగణం ఉండగా, ఇది ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఉంది. బుద్వేల్లోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం 1500 గజాల్లో ఉంది. కొలిక్కివచ్చిన సర్కారీ స్థిరాస్తుల వివరాలు శాఖాధిపతుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఆగమేఘాల మీద కొలతలు,బిల్టప్ ఏరియా అంచనాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ స్థిరాస్తుల లెక్క కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలోని సర్కారీ భవంతుల సమస్త సమాచారాన్ని బుధవారంలోపు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద ప్రభుత్వ భవనాలను కొలిచి సమగ్ర వివరాలను సేకరించిన యంత్రాంగం.. ఆయా శాఖాధిపతుల ద్వారా సమాచారాన్ని ప్రభుత్వానికి పంపింది. భవన విస్తీర్ణం, సర్వే నంబర్, లీజులు, ఆక్రమణలు, కోర్టు కేసులు, ప్రధాన మార్గానికి ఎంత దూరం? తదితర అంశాలపై రూపొందించిన నమూనాకు అనుగుణంగా వివరాలను పొందుపరిచింది. జంటనగరాల్లో విసిరేసినట్లుగా ఉన్న జిల్లా కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో భాగంగానే సర్కారు ఆఫీసుల బిల్టప్ ఏరియా లెక్క తేల్చిన ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విలువైన ప్రదేశాల్లో కొలువుదీరిన కార్యాలయాల స్థలాలను విక్రయించడం ద్వారా ఖజానా నింపుకొనే యోచన కూడా చేస్తున్న ప్రభుత్వం.. సమస్త సమాచారాన్ని సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. -
జాబ్‌చార్ట్‌ను కొనసాగించాలని వినతి
రాజంపేట:క్లస్టర్, పీహెచ్సీ పరిధిలో విధి నిర్వహణలో తమకు కేటాయించిన జాబ్‌చార్ట్‌ను కొనసాగించాలని సీహెచ్ఓ, ఎంపీహెచ్‌ఓలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ పిచ్చయ్య ఆధ్వర్యంలోజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీ.రాజా, నారాయణ డీఎంఅండ్‌హెచ్‌ఓ నారాయణనాయక్‌కు విన్నవించారు. జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మంగళవారం డీఎంఅండ్‌హెచ్‌ఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాజంపేటలో పిచ్చయ్య విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ క్లస్టర్ పరిధిలో పనిచేసే సీహెచ్ఓ, ఎంపీహెచ్ఓల విధుల నిర్వహణ గురించి సరైన మార్గదర్శకాలను జారీ చేయాలని కోరారు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది సాధారణ సెలవును మంజూరు చేసే అధికారం తమకే ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో (సబ్‌సెంటర్) ఎన్ఆర్ హెచ్ఎం స్కీం కింద విడుదలైన నిధులను ప్రస్తుతం మహిళ ఆరోగ్య కార్యకర్తలు, పబ్లిక్ హెల్త్ నర్సులు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ అకౌంట్ కింద ఖర్చు చేస్తున్నారని వివరించారు. సంబంధిత మగ, ఆడ ఆరోగ్య పర్యవేక్షకులు, మహిళ ఆరోగ్య కార్యకర్తలు జాయింట్ అకౌంట్ కింద నిధులు ఖర్చు చేసేందుకు అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓల సంఘం ఉపాధ్యక్షులు మురళీ, దిబ్బన్న, నాగరాజస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు టీపీ రెడ్డయ్య, జాయింట్ సెక్రటరీ కుసుమకుమారి, జిల్లా నేతలు వేణు, స్వామిదాస్, సురేంద్రరాజు పాల్గొన్నారు.