నూతన పారిశ్రామిక విధానం భేష్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం భేషుగ్గా ఉందని చెప్పవచ్చు. కొత్త రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబ డులు ఆకర్షించే విధంగా నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉంది. పరిశ్రమల్లో నామమాత్రపు తనిఖీలు, పూర్తిస్థాయి మద్దతు, ప్రాజెక్టు అనుమతులు తదితరాలను మంజూరు చేసేందుకు సింగిల్‌విండో విధానాన్ని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడుల సేకర ణకు విరివిగా అవకాశాలు లభిస్తాయి.
పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకోసం 2014-15 బడ్జెట్లో 1,165 కోట్ల రూపాయలు కేటాయించడం, చిన్న తరహా సూక్ష్మస్థాయి పరిశ్రమల రంగానికి సంబంధించి లెసైన్సులు, అనుమ తుల మంజూరుకు సంబంధించిన విధానాలను వికేంద్రీకరించడం, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనేందుకు అవస రమైన మార్కెటింగ్ సహకారాన్ని అందించడం శుభసూచకం. ఎస్సీ, ఎస్టీలకు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకోసం చర్యలు ప్రతిపాదించడం సంతోషదాయకం. నిరంతర సమీక్ష, పర్యవేక్షణతో పాలసీ అమలుపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
సురేష్ కాలేరు భారత్‌నగర్, భువనగిరి