రాజమండ్రి ఘటన ప్రభుత్వ తప్పిదమే
పోలవరం : రాజమండ్రి ఫుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27 మంది ప్రాణాలు కోల్పోరుున ఘటన ప్రభుత్వ తప్పిదం వ ల్లే జరిగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, కొత్తపల్లి నాని, వన్నెంరెడ్డి శ్రీనివాస్‌తో కలిసి గూటాలలో పుష్కర స్నానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించటానికే గాని, సృష్టించడానికి కాదన్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో ఉదయం 6.20 భక్తులను స్నానాలకు వదిలి ఉంటే భక్తుల ప్రాణాలు పోయేవి కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా పుష్కరఘాట్‌లో స్నానమాచరించి గంటల తరబడి అక్కడ ఉండడంతో భక్తుల సంఖ్య పెరిగిపోరుుందని,
దీంతోనే ఘటన జరిగిందని కొత్తపల్లి చెప్పారు. అధికారులకు బాధ్యతలు అప్పగించకుండా ప్రభుత్వం ప్రచారం కోసం అనవసరమైన హడావిడి చేసిందన్నారు. ఈనెల 21న కేబినెట్ సమావేశం రాజమండ్రిలో పెడతానని సీఎం చెప్పారని, దీనివల్ల పుష్కరాలకు వచ్చే భక్తులు, స్థానికులకు ఇబ్బందులు తప్ప ఒరిగేదేమీ ఉండదని చెప్పారు. పుష్కరాల తర్వాత రాజమండ్రిలో కేబినెట్ సమావేశం పెట్టుకోవాలని సుబ్బారాయుడు సూచించారు. రాజమండ్రిలో ఇప్పటికే వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో కేబినెట్ సమావేశం తగదన్నారు. పట్టిసీమలో దైవదర్శనం కోసం వెళ్లే భక్తులు ఇసుక తిన్నెలపై ఎండలో ఇబ్బందులు పడుతున్నారని, చలువ పందిళ్లు వేయించాలని సూచించారు. మండల కన్వీనర్ సుంకర వె ంకటరెడ్డి, పార్టీ నాయకులు బుగ్గా మురళీకృష్ణ, వలవల సత్యనారాయణ, షేక్ ఫాతిమున్నీసా తదితరులు ఆయన వెంట ఉన్నారు.