graduates&teachers mlc elections
-
ఇంకా తేలని ‘ఎమ్మెల్సీ’ ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రెండో ప్రాధాన్యత ఓట్లతోనే తేలనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచి్చనా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. దీంతో గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గెలుపెవరిదో? హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 18,565 మాత్రమే ఉంది. తీన్మార్ మల్లన్న గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు సాధించాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యతలో 1,04,248 ఓట్లు రాగా, ఆయన గెలవాలంటే 50,847 ఓట్లు రెండో ప్రాధాన్యతలో రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్వంతంత్ర అభ్యర్థి అశోక్‌కు కూడా భారీగానే ఓట్లు లభించాయి. మొత్తం 52 మంది అభ్యర్థులలో ఈ నలుగురు అభ్యర్థులకు 3,00,071 ఓట్లు వచ్చాయి.మిగిలిన అభ్యర్థులందరికీ 10,118 ఓట్లు లభించాయి. ఇవన్నీ ఎలిమినేషన్లో క్రమంగా పోనున్నాయి. ఈ ఓట్లను లెక్కించినా గెలుపు టార్గెట్‌ను అభ్యర్థులు చేరుకునే అవకాశం లేదు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. చివరగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తరువాతే ఫలితం వెల్లడి కానుంది. రెండు రోజులుగా కౌంటింగ్ ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఓట్లు 4,63,839 కాగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పత్రాలను బండిల్స్‌గా కట్టడానికే సరిపోయింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఆ తరువాత గెలుపునకు టార్గెట్ 1,55,096 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత శుక్రవారం తుది ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.నాలుగు హాళ్లలో 96 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై వేయి ఓట్ల చొప్పున గురువారం రాత్రి వరకు నాలుగు రౌండ్లలో 3,36,013 ఓట్లను లెక్కించారు. అందులో 3,10,189 ఓట్లు చెల్లినవిగా తేల్చారు. 25,824 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ లెక్కింపు ఒకటో రౌండ్ ఫలితం బుధవారం రాత్రి 12:45 గంటలకు వెలువడగా, రెండో రౌండ్ ఫలితం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడైంది.మూడో రౌండ్ ఫలితం సాయంత్రం 5 గంటలకు వెల్లడించగా, 4వ రౌండ్ ఫలితం రాత్రి 9 గంటలకు వెల్లడైంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటరి్నంగ్ అధికారి దాసరి హరిచందన నేతృత్వంలో సిబ్బందికి మూడు షిప్టులలో వి«ధులు కేటాయించి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులకు షాక్ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి అధికారికంగా అభ్యర్థులను నిలపొద్దని పార్టీ నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో చోటు చేసుకున్న ప్రతికూల పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పార్టీ అభ్యర్థులను బరిలో నిలపొద్దని భావిస్తున్నట్లు సమాచారం. ఇది టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ కావాలని కలలుగన్న ఆ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌తో పాటు ట్రెస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు ప్రయత్నించారు. కానీ టీఆర్ఎస్ అధికారికంగాఅభ్యర్థిని ప్రకటించలేమని స్పష్టం చేయడంతో రవీందర్ సింగ్ మౌనం దాల్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్న మేయర్ శనివారం కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఇక యాదగిరి శేఖర్‌రావు ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈనెల 5న భారీ ర్యాలీతో వచ్చి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయాలని నిర్ణయించారు. ఉద్యోగానికి చంద్రశేఖర్ గౌడ్ రాజీనామా గ్రూప్–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్య మకాలం నుంచి కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ప్రభుత్వ ఉద్యోగానికి శని వారం రాజీనామా చేశారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకే ఆయన ఉద్యోగాన్ని వదులుకోగా.. ప్రభుత్వం వెంటనే ఆమోదించడం గమనార్హం. టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావించిన చంద్రశేఖర్‌గౌడ్ తనను అభ్యర్థిగా ప్రకటించాల్సిందిగా సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులను కలిశారు. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు అధికారిక అభ్యర్థి ఉండరని తేల్చినా.. అంతర్గతంగా మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అం దులో భాగంగానే ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే ఆమో దించారని ఆయన వర్గీయులు చెపుతున్నారు. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. కాగా, చంద్ర శేఖర్‌గౌడ్ ఈనెల 5న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సైతం.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో కూడా టీఆర్ఎస్ తటస్థ వైఖరినే అవలంబించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీల జోక్యం వద్దని భావించిన టీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. తొలుత శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరిట ప్రకటన వెలువడినా.. ఆ తర్వాత పరిణామాలతో మిన్నకుండిపోయారు. దీంతో ఆయన ఉపాధ్యాయ సంఘాల తరుపునే పోటీలో ఉన్నారు. అలాగే, శని వారం పీఆర్టీయూ నుంచి కూర రఘోత్తంరెడ్డి నామినేషన్ దాఖ లు చేశారు. అలాగే ఎస్టీయూ నుంచి మామిడి సుధాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి కూడా బరిలో నిలిచారు. కిటకిటలాడిన కలెక్టరేట్ గతనెల 25వ తేదీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా, శనివారం మాత్రమే కలెక్టరేట్ సందడిగా కనిపించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం శుక్రవారం వరకు కేవలం నాలుగు నామినేషన్లు రాగా, శనివా రం ఒక్కరోజే 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్‌కు చెందిన కళ్లెం ప్రవీణ్‌రెడ్డి, కామారెడ్డికి చెందిన ఏబీవీపీ మాజీ నాయకుడు గురువుల రణజిత్ మోహన్, పోరుపెల్లి ప్రభాకర్‌రావు, గుర్రం ఆంజనేయులు, తోడేటి శ్రీకాంత్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, బుట్ట శ్రీకాంత్, ఎడ్ల రవికుమార్ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం ఒక్కరోజే పీఆర్టీయూ నుంచి కూర రఘోత్తంరెడ్డి, ఎస్టీయూ నుంచి మామిడి సుధాకర్‌రెడ్డితో పాటు కొండల్‌రెడ్డి, చార్ల మానయ్య, నిథానియల్ తమ నామినేషన్లు సమర్పించారు. -
ప్రజా విజయం
+ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బాటలో వైఎస్సార్సీపీ + స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం + తెలుగుదేశం పార్టీని ఉతికి ఆరేసిన ఉపాధ్యాయులు + కత్తి విజయకేతనం ప్రజాతీర్పు వైఎస్సార్సీపీని వరించింది. విద్యావంతులు, మేధావులు టీడీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రజా క్షేత్రంలో విజయం అసాధ్యమని రూఢీ చేశారు. కొనుగోలు చేసుకున్న విజయంతోనే సరిపెట్టుకోక తప్పదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీని ఉపాధ్యాయులు ఉతికి ఆరేశారు. అధికార టీడీపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించారు. టీడీపీ పెద్దలను గ్రాడ్యుయేట్స్ బట్టలూడదీసి వేలాడదీశారు. సాక్షి ప్రతినిధి, కడప: శాసనమండలి స్థానిక సంస్థల కడప సీటును టీడీపీ కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలు..తెలుగు‘దేశం’లో అత్యంత ఖరీదైన ఎమ్మెల్సీగా కడప సీటు కీర్తి గడించనుంది. రూ.100 కోట్లు మంచినీళ్లు లెక్కన ఖర్చు చేయడంతో ఇది సాధ్యమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయిని బట్టి రేటు నిర్ణయించారు. ఒక్కో ఓటుకు రూ.25 లక్షలు చెల్లించి కడపలో గెలిచాం అన్పించేందుకు తాపత్రయం చూపారు. డబ్బున్నోడిదే గెలుపుగా ధ్రువీకరించారు. ఆపై టీడీపీ నేతలంతా ముక్తకంఠంతో విజయం సాధించామని గెంతులేశారు. వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ‘పబ్లిక్ విక్టరీ’ చేజారింది. ‘పర్చేజ్ విక్టరీ’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి ఉపాధ్యాయుల చెంపపెట్టు: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ బచ్చల పుల్లయ్యను బరిలో దించింది. ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి పోటీచేశారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి సైతం పోటీలో ఉన్నారు. అధికార పార్టీలకు చెందిన అటు ఒంటేరు, ఇటు బచ్చల పుల్లయ్య ఉపాధ్యాయులను డబ్బుతో ఆకర్షించే ఎత్తుగడలకు పాల్పడ్డారు. కత్తి నరసింహారెడ్డి టీచర్లతో సమావేశం నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యమాలతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కత్తి నరసింహారెడ్డి పేరుతో ఉన్న మరో (డమ్మీ) వ్యక్తిని సైతం పోటీలో నిలిపారు. ఓవైపు డబ్బులు, మరోవైపు కుయుక్తులను ఉపాధ్యాయులు పసిగట్టారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో తీర్పు చెప్పారు. కత్తి నరసింహారెడ్డికి 9,624 ఓట్లు లభించగా, ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 5,861 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య ద్వితీయ ప్రాధాన్యత ఓటు నుంచి ఎలిమినేట్ కావాలి్సన పరిస్థితి నెలకొంది. 18,840 ఓట్ల తీర్పులో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీని తిరస్కరిస్తూ తీర్పు చెప్పారు. ఓటుతో బుద్ధి చెప్పిన విద్యావంతులు: తెలుగుదేశం పార్టీ చీప్‌ట్రిక్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పారలేదు. విద్యావంతులు ప్రభుత్వ పెద్దలకు ఓటుతో బుద్ధి చెప్పారు. కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలలోని మేధావులు టీడీపీని తిరస్కరించారు. 1,55,711 ఓట్లు పోల్ అయ్యాయి. వాటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేజే జెరెడ్డికి కేవలం 41,037 ఓట్లు మాత్రమే లభించాయి. పోటీచేసిన అభ్యర్థుల్లో అత్యధికంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డికి 53,734 ఓట్లు దక్కాయి. పీడీఎఫ్ అభ్యర్థి డాక్టర్ గేయానంద్‌కు 32,810 ఓట్లు దక్కాయి. 18,363 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపొందాలంటే 67,887 ఓట్లు లభించాల్సి ఉంది. దాంతో ద్వితీయ ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ ప్రా రంభించారు. కాగా తెలుగుదేశం పార్టీ అ భ్యర్థి కంటే వైఎస్సార్సీపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 12,694 ఓట్ల ఆధిక్యత సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓటు తొలిరౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ ఆధిక్యత 14వేలు దాటింది. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి అడుగులు విజయం దిశగా పడ్డాయి. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి పరాజయం బాటలో పయనించక తప్పలేదు. తెలుగుదేశం పార్టీని విద్యావంతులు, మేధావులు, ఉ పాధ్యాయులు గట్టిగా తిరస్కరించారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 839 ఓట్లు కాబట్టి పెద్ద ఎత్తు న ప్రలోభాలకు గురిచేశారని, ప్రజలు, మే ధావులు, విద్యావంతుల్లో టీడీపీ పరువు నిలుపుకునే పరిస్థితి కూడా లేకపోయిం దని పలువురు విశ్లేషిస్తున్నారు. ‘పబ్లిక్ విక్టరీ(ప్రజా విజయం)’ వైఎస్సార్సీపీ సొంతం కాగా, ‘పర్చేజ్ విక్టరీ’(కొనుగోలు చేసిన విజయం) టీడీపీ సొంతమైందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.