తాండూరులో భారీ వర్షం
తాండూరు, తాండూరు టౌన్: తాండూరులో కుండపోతగా వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం 4.30గంటల నుంచి ఆరు గంటల వరకు కురిసిన వర్షం.. తిరిగి అర్ధరాత్రి 12గంటల నుంచి ఉరుములు, మెరుపులతో ప్రారంభమై కుండపోతగా కురిసింది. తెల్లవారుజాము వరకూ భారీ వర్షం పడింది. పట్టణంలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.సుధాకర్ తెలిపారు.
ఈ వర్షం కంది, పత్తి పంటలు విత్తుకోవడానికి అనుకూలమని ఆయన తెలిపారు. భారీ వర్షం కారణంగా పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లు బురదమయంగా మారాయి. మురుగుకాలువల్లో చెత్తా చెదారం అడ్డుపడటంతో మురుగునీరు వీధుల్లోకి చేరింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం పట్టణ కమిషనర్ గోపయ్య పలువురు కౌన్సిలర్లతో కలిసి కొన్ని వార్డుల్లో పర్యటించారు.
పొంగిపొర్లిన వాగులు.. వంకలు..
షాబాద్: భారీ వర్షంతో వాగులు, వం కలు పొంగిపొర్లాయి. వరదనీటి ఉద్ధృతితో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. షాబాద్ మండలం ఎల్గొం డగూడ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామాలు మీరాపూర్, చర్లగూడల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం కురి సిన భారీ వర్షానికి ఆయా గ్రామాల్లో ని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు 3గంటలపాటు వాగు వద్దనే పడిగాపులు కాశారు. కొంతమంది పిల్లలను ఎత్తుకుని వాగు దాటారు.
మీరాపూర్ గ్రామానికి వెళ్లే కల్వర్టు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వర్షం ధాటికి కల్వ ర్టు పూర్తిగా తెగిపోయింది. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వానాకాలం వచ్చిదంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని, ఈ విషయాన్ని అధికారులకు, ప్రజాప్రతిని దులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మండిపడ్డారు.