grand farewell
-
మా మంచి కలెక్టరమ్మ: పూలరేకులపై నడిపిస్తూ.. సెల్యూట్లు చేస్తూ
గాంధీనగర్: కొందరు అధికారులు తమ సేవలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. తనకు కష్టం ఉన్నా.. తన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనే తాపత్రయంతో నిరంతరం శ్రమిస్తుంటారు. అటువంటి అధికారులు ఉంటే తమకు కూడా మంచే జరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ఒకవేళ ఆ అధికారి మరోచోటకు బదిలీ అయి వెళ్లిపోతుంటే తమ ఇంట్లో మనిషి వెళ్లిపోతున్నట్లే ఏడుస్తుంటారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వ అధికారి అన్నప్పుడు బదిలీలు సాధారణం. తాజాగా ఒక జిల్లా కలెక్టర్ బదిలీ పేరిట మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో అక్కడి ప్రజలు, అధికారులు ఆమెకు ఘనమైన వీడ్కోలు ఇవ్వడం వైరల్‌గా మారింది. వివరాలు.. గుజరాత్ లోని రాజకోట్ జిల్లాకు రెమ్యా మోహన్ కలెక్టర్‌గా సేవలందిస్తున్నారు. తన పనితనంలో ఆమె అక్కడి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వారం కిందట రెమ్యా మోహన్నేషనల్ హెల్త్ మిషన్, డైరెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలు, ఉద్యోగులు భావోద్వేగంతో ఆమెకు చివరిసారిగా వీడ్కోలు పలికారు. పూలు జల్లుతూ.. రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పూల రథంతో వీడ్కోలు పలుకుతూ తమ గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడి సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించిన రెమ్యా మోహన్ కన్నీటిపర్యంతం అవుతూ అక్కడి నుంచి వెళ్లారు. కాగా కోవిడ్ -19 తో పాటు ఈ మధ్యన వచ్చిన తుఫాను సమయంలోను రెమ్యా నాయక్ నిరంతరం శ్రమించారు. ఎంత కష్టం ఎదురైనా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవను కొనసాగించారు. ఈ కృతజ్ఞతాభావంతోనే అక్కడి ప్రజలు, అధికారులు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఘనంగా వీడ్కోలు పలికారు. 1980 లో ఎస్.జగదీషన్ తరువాత ఒక జిల్లా కలెక్టర్‌కు ఈ విధంగా గౌరవం లభించడం ఇదేనని అక్కడి స్థానికులు సంతోషంతో పేర్కొన్నారు. -
చీఫ్ జస్టిస్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తాకు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయమూర్తులందరూ దీని కోసం శుక్రవారం మధ్యాహ్నం మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ సేన్ గుప్తా న్యాయవ్యవస్థకు చేసిన సేవలను ఇరు రాష్ట్రాల ఏజీలు కొనియాడారు. అనంతరం జస్టిస్ గుప్తా తన సుదీర్ఘ న్యాయ ప్రస్తానం గురించి మాట్లాడారు. తనకు సహకరించిన వారికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత న్యాయవాదుల సమక్షంలో జరగాల్సిన వీడ్కోలు కార్యక్రమం జరగలేదు. జస్టిస్ గుప్తాకు వీడ్కోలు ఇచ్చే విషయంలో న్యాయవాదులు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణకు దిగడంతో ఆ కార్యక్రమం రద్దు అయింది. -
జగన్‌కు ఘనంగా వీడ్కోలు
మధురపూడి, న్యూస్‌లైన్ :జిల్లాలో రెండు రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం మధురపూడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉదయం 10 గంటలకు జగన్ ప్రత్యే క విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధులు, కోఆర్డినేటర్లు, కన్వీనర్లు విమానాశ్రయంలో సాదరంగా వీడ్కోలు చెప్పారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బా యి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి పిని పే విశ్వరూప్, తాజామాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర మహిళావిభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, ీ సజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నర్సాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెం ట్ నియోజకవర్గాల నేతలు రఘురామకృష్ణం రాజు, చలమలశెట్టి సునీల్, బొడ్డు వెంకటరమణచౌదరి విమానాశ్రయంలో జగన్‌ను కలసి వీడ్కోలు పలికారు. వివిధ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, తోట సుబ్బారావునాయుడు, మిండగుదిటి మోహ న్, విపర్తి వేణుగోపాలరావు, దాడిశెట్టి రాజా, బొమ్మన రాజ్‌కుమార్, అనంత ఉదయభాస్కర్, ఆకుల వీర్రాజు, మట్టా శైలజ, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, అనుబంధ విభాగాల కన్వీనర్లు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీలు, కాకినాడ కన్వీనర్ ఫ్రూటీకుమార్, పార్టీ ట్రేడ్‌యూనియన్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, ములగాడ ఫణి, రావి పాటి రామచంద్రరావు, జక్కంపూడి రాజా, భూపతిరాజు సుదర్శనబాబు, చోడిశెట్టి రాఘవబా బు, నక్కా రాజబాబు, మార్గన గంగాధర్, చింతపల్లి చంద్రం, మేడిశెట్టి శివరాం, గణేశుల పోసియ్య, రాయపురెడ్డి చిన్నా వీడ్కో లు పలికారు. కాగా అంతకుముందు కాకినాడ లో తాజామాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డి నివాసంలో జగన్‌ను పలువురు నేతలు కలుసుకున్నారు.