ఏఆర్ రెహమాన్‌కు జపాన్ పురస్కారం
న్యూఢిల్లీ: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జపాన్ అందించే గ్రాండ్ ఫ్యూకూవోకా అవార్డు-2016కు ఎంపికయ్యారు. ఆసియా దేశాల సంస్కృతిని తన సంగీతం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పినందుకు రెహమాన్‌ను ఈ పురస్కారం వరించింది. ఇప్పటివరకు ఈ అవార్డును అందుకున్న భారతీయుల్లో సితార్ విద్వాంసులు పండిట్ రవిశంకర్, నర్తకి పద్మా సుబ్రమణ్యం, చరిత్రకారులు రోమిలా థాపర్, సరోద్ విద్వాంసులు అంజాద్ అలీ ఖాన్ తదితర ప్రముఖులు ఉన్నారు.