grand wellcome
-
వంద కార్లతో.. అదిరిపోయేలా...
ఆకివీడు: తెలుగుదేశంలో ఇమడలేక వైఎస్సార్సీపీలో చేరి మొదటి సారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన కనుమూరు రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఉప్పుటేరు వంతెన వద్దకు చేరుకోగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూలమాలలు, గజమాలలతో ఘనంగా సత్కరించారు. కృష్ణార్జునుల చిత్రపటాన్ని అందజేశారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం కార్ల ర్యాలీలో ఆకివీడు, అయిభీమవరం చేరుకోగానే స్థానిక ప్రజలు బ్రహ్మరధం పట్టారు. అనంతరం చెరుకుమిల్లి, ఏలూరుపాడు, జువ్వలపాలెం, కాళ్లకూరు చేరుకున్నారు. కాళ్లకూరు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాళ్ల మీదుగా సీసలి, జక్కరంలో మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పెదమిరంలోని రఘురామకృష్ణంరాజు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పార్టీలో చేరారు. రఘురామకృష్ణంరాజుకు స్వాగతం పలికినవారిలో నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర సలహాదారుడు పాతపాటి సర్రాజు, జిల్లా యువజనవిభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్, మండల కన్వీనర్లు కేశిరెడ్డి మురళీ, గులిపల్లి అచ్చారావు, నాయకులు నంద్యాల సీతారామయ్య, జగ్గురోతు విజయ్‌కుమార్, షేక్ హుస్సేన్, అంబటి రమేష్, మోరా జ్యోతి, జి.ధనరాజు, జోగి నాగరాజు, జామి శ్రీనివాస్, పుప్పాల పండు, శిరపు శ్రీనివాస్, కొత్తపల్లి నాగరాజు, కనుమూరు ఆనంద వర్మ పాల్గొన్నారు. -
మస్త్.. మస్త్..
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. పిల్లలు, యువకులు, పెద్దలు.. ఎవరికి తోచినట్లు వారు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. బేకరీలు, హోటళ్లు, డాబాలు జనంతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి కాగానే కేక్ కట్ చేసి.. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా యువత కేరింతలు కొట్టారు. 2013కి గుడ్ బై చెబుతూ 2014కి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వెల్కమ్ చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతపురంలో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా అందరూ సంతోషంగా అర్ధరాత్రి వరకు మేలుకున్నారు. సరిగ్గా 12 గంటలు కాగానే ‘హ్యాపీ న్యూఇయర్’ అంటూ కేకలు వేస్తూ.. బంధు మిత్రులకు ఫోన్లు చేశారు. ఎస్ఎంఎస్లు పంపారు. మహిళలు ఇళ్ల ముందు రంగవల్లులు వేసి నూతన సంవత్సరానికి సుస్వాగతం పలికారు. అర్ధరాత్రి యువత సందడి చేసింది. రోడ్లమీద కొచ్చి అందరికీ విష్ చేస్తూ ఆనందం పంచుకున్నారు. విద్యాసంస్థల్లో మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్ వంటి ప్రదేశాల్లో యువకులు బైక్‌లతో హల్చల్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జిల్లాలో సగటున రోజుకు రూ.2 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగేవి. అయితే డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజు మాత్రమే రూ.7 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలిసింది.