క్వారీ కార్మికులకు శిక్షణ ఇవ్వాలి
వరంగల్: గ్రానైట్ క్వారీల్లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని పనిలో పెట్టుకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్(సేఫ్టీ) ఎ.రాంబాబు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా గ్రానైట్ క్వారీ, స్టోన్ క్రషర్స్ వృత్తి శిక్షణ కేంద్రం అధ్వర్యంలో గనుల యాజమానులు, మేనేజర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రానైట్, స్టోన్ క్రషర్స్లో పనిచేస్తున్న కార్మికులకు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. మైనర్లను పెట్టుకుంటే చట్టరీత్య నేరమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆసోసియేషన్ ప్రతినిధులు ఎస్.నరేష్, ఆర్.వెంకటేశ్వర్రావు, నర్సింహరెడ్డి, వెంకటేశ్వర్లు, వీటీసీ మేనేజర్ బి.చంద్రు, అసిస్టెంట్ జియాలజిస్టు టి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.