పేస్ ‘సెంచరీ’
డబుల్స్‌లో తన 100వ భాగస్వామిగా గ్రానోలెర్స్
నాటింగ్హమ్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరో అరుదైన ఘనతను సాధించనున్నాడు. సోమవారం మొదలైన ఎగాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పేస్ పురుషుల డబుల్స్‌లో తన 100వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో స్పెయిన్‌కు చెందిన మార్సెల్ గ్రానోలెర్స్తో పేస్ జత కట్టనున్నాడు. 1991లో ప్రొఫెషనల్‌గా మారిన పేస్ ఇప్పటివరకు డబుల్స్‌లో 99 మంది భాగస్వాములతో వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. కెరీర్లో 702 మ్యాచ్‌ల్లో గెలిచిన పేస్, 55 డబుల్స్ టైటిల్స్ సాధించాడు.